పుట:Telugu Talli 1937 11 01 Volume No 1 Issue No 6.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కుమార సంభవము (అనువృత్తము)

                         తృ తీ య స ర్గ ము

తే.గీ|| మదన! నీకుస్సంగాతి యీ - మాధవుండు
        చెప్పకయే వచ్చుదోడ, నేం - జెప్పనేల?
        అసలునౌదోడుపడుమని - యనిలునకును
        వెవ్వ డెప్పుడాదేశించు - నిద్ధవీర్య!. 21
తే.గీ|| అనిన నట్లగుగాకవి - యపమశరుడు
         విభునియాజ్ఞ నొదల శేష - నిధినిదాల్చి
         నడచె నైరావతాస్ఫాల - నమున బిరుసు
         గలుగుకరమున నింద్రుండు -గారవింప 22
తే.గీ|| శంకతోవసంతుడు రతి - జరుగవెంట
         దేహమసువులు దీఱిన - దీఱుగాక,
         దేవకార్యము తప్పక - దీర్తుననుచు
        మనసిజుం డీశ్వరాశ్రమ-మునకుజనియె 23
తే.గీ|| అంవనంబు పంయము - లైనమునుల
        తపములకు బ్రతికూల వ -ర్తనమువాడు,
        మదనునభిమాన భూతుడు - మాధవుండు
       పెల్లుగానాత్మగుణము ప - ర్తిల్లజేసె. 24
తే.గీ|| తీక్షకరుడు కాలంబు న - తిక్రమించి
        తా గులేర పాలిత దిశం - దమినిజేర
        గడగ దక్షిణ దిజ్ముఖ - గంధనహము
        నఱులెపుడు వ్యళీక ని - శ్వాసమునలె 25
తే.గీ|| బోదెనుండి చివుళ్లు పు - వ్వులును లూచె
        నల యశోకము, రవళించు - నందియలను
        దనుకు సుందరి పాద తా - డనము నుంత
        యైన గొరదయ్యెను వసం - తాగమమున 26
తే.గీ|| చివురు మొలకల గఱులుగా - నవరసాల
        సూన బాణంబుచేసి య - ద్దాని మీద