పుట:Telugu Right to Information Act.pdf/5

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


(డి) "ప్రధాన సమాచార కమీషనర్", "సమాచార కమీషనర్" అనగా సెక్షన్ 12లోని సబ్ సెక్షన్ (3) కింద నియమితులయ్యే ప్రధాన సమాచార కమిషనర్, సమాచార కమిషనర్.
(ఇ) ‘సమర్ధాధికారి’ అనగా
(i) లోక్ సభ, రాష్ట్ర శాసనసభ, కేంద్ర పాలిత ప్రాంత శాసనసభలకు సంబంధించిన స్పీకర్, రాజ్యసభ, రాష్ట్ర విధాన మండలులకు సంబంధించి ఛైర్మన్.
(ii) సుప్రీంకోర్టుకు సంబంధించి భారత ప్రధాన న్యాయమూర్తి
(iii) హైకోర్టు కు సంబంధించి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి,
(iv) రాజ్యాంగం ప్రకారం, రాజ్యాంగం కింద ఏర్పాటయిన ఇతర యంత్రాంగాలకు సంబంధించి రాష్ట్రపతి లేక గవర్నర్
(v) రాజ్యాంగంలోని ఆర్టికల్ 239 కింద నియమితులైన అడ్మినిస్ట్రేటర్
(ఎఫ్) "సమాచారం" అనగా రికార్డులు, పత్రాలు, మెమోలు, ఈ-మెయిళ్ళు, అభిప్రాయాలు, సలహాలు, పత్రికా ప్రకటనలు, సర్య్కులర్లు, ఉత్తర్వులు, లాగ్ బుక్స్,కాంట్రాక్టులు, నివేదికలు, పేపర్లు, శాంపిళ్లు, మోడళ్ళు, డేటా సహా ఎలక్ట్రానిక్ రూపంతో పాటు ఏ రూపంలో నయినా ఉన్న సమాచారం. అమలులో ఉన్న మరో చట్ట ప్రకార మయినా ప్రభుత్వ యంత్రాంగం సంపాదించదగిన ఏ ప్రైవేటు సంస్థకు సంబంధించిన సమాచారమయినా ఈ చట్టం ప్రకారం సమాచారమే.
(జి) "నిర్ణీత" అనగా ఈ చట్టం కింద రూపొందిన రూల్స్ ప్రకారం ప్రభుత్వం గానీ, సమర్దాధికారి గానీ నిర్ణయించిన విధంగా
(హెచ్) ‘అధికార యంత్రాంగం’ అనగా ఈ కింది పద్ధతులలో ఏర్పాటయిన ప్రభుత్వ, స్వపరిపాలనా సంస్థలు :
(ఎ) రాజ్యాంగం కింద లేదా రాజ్యాంగం ద్వారా
(బి) పార్లమెంట్ రూపొందించిన ఏ చట్టం ప్రకారమయినా
(సి) రాష్ట్రశాసన సభలు రూపొందించిన మరే చట్టం ప్రకారమయినా
(డి) సముచిత ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ లేదా ఉత్తర్వు ద్వారా
(i) సముచిత ప్రభుత్వ సొంతమయిన, నియంత్రణలోవున్న లేదా గణనీయంగా నిధులు పొందుతున్న సంస్థలు
(ii) ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సముచిత ప్రభుత్వంనుండి గణనీయంగా నిధులు అందుకుంటున్న ప్రభుత్వేతర సంస్థలు కూడా అధికార యంత్రాంగం కిందకే వస్తాయి.
(ఐ) "రికార్డు" అనగా
(ఎ) ఏదైనా పత్రం, రాతప్రతి, ఫైలు (బి) ఏదైనా మైక్రో ఫిల్ము, మైక్రోఫిష్ (ఫైలు చేయడానికి వీలయిన మైక్రోఫిల్ము), పత్రం ఫాక్సిమిలి ప్రతి. (సి) అలాంటి మైక్రోఫిల్ముల నుంచి తీసిన చిత్రం లేక చిత్రాలు (అదే సైజులో గానీ, పెద్దవిగా చేసిగానీ) (డి) కంప్యూటర్ మరేదైనా పరికరం ద్వారా ఉత్పత్తి అయ్యే సమాచారం సంపత్తి.
(జె) "సమాచార హక్కు" అనగా ఏ అధికార యంత్రాంగం నియంత్రణ కింద ఉన్న సమాచారాన్నయినా ఈ చట్టం కింద పొందగలిగే హక్కు. (i) పనులనూ, పత్రాలనూ, రికార్డులను తనిఖీ చేసే హక్కు