పుట:Telugu Right to Information Act.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొదటి షెడ్యూలు

(సెక్షన్ 13 లోని సబ్ సెక్షన్ (3) చూడండి)

ప్రధాన సమాచార కమిషనర్, సమాచార కమిషనర్, రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్, రాష్ట్ర సమాచార కమిషనర్ స్వీకరించాల్సినపదవీ ప్రమాణం.

ప్రధాన సమాచార కమిషనర్/సమాచార కమిషనర్/రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్/రాష్ట్ర సమాచార కమిషనర్ గా నియమితులైన......అనే నేను దేవుని ఎదుట ప్రమాణం చేసి,చట్ట ప్రకారం ఏర్పాటయిన భారత రాజ్యాంగానికి నిజమైన విశ్వాసం, భక్తి శ్రద్ధలతో కట్టుబడి ఉంటానని, భారత సార్వభౌమాధికారం, సమగ్రతను పరిరక్షిస్తానని, నాకు సాధ్యమైనంతవరకు విచక్షణతో, విజ్ఞానంతో, విశ్వాసంగా భయ, పక్షపాత, దురభిప్రాయరహితంగాపదవీ బాధ్యతలు నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను.

రెండవ షెడ్యూలు

(సెక్షన్ 21 చూడండి)

కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇంటలిజెన్స్, భద్రతా సంస్థలు

  1. ఇంటలిజెన్స్ బ్యూరో
  2. క్యాబినెట్ సెక్రటేరియట్ లోని రీసెర్చి అండ్ అనాలసిస్ వింగ్ (రా)
  3. రెవిన్యూ ఇంటలిజెన్స్ డైరక్టరేట్
  4. సెంట్రల్ ఎకనమిక్ ఇంటలిజెన్స్ బ్యూరో
  5. ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్
  6. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో
  7. ఏవియేషన్ రీసెర్చి సెంటర్
  8. స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్
  9. సరిహద్దు భద్రతాదళం
  10. కేంద్ర రిజర్వు పోలీసు బలగం
  11. ఇండో టిబెటియన్ బార్డర్ ఫోర్స్
  12. కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం
  13. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్
  14. అస్సాం రైఫిల్స్
  15. స్పెషల్ సర్వీస్ బ్యూరో
  16. స్పెషల్ బ్రాంచ్ (సిఐడి) అండమాన్, నికోబార్
  17. క్రైం బ్రాంచి సిఐడి - సిబి, దాద్రానగర్ హావేలీ
  18. స్పెషల్ బ్రాంచి, లక్షద్వీప్ పోలీస్