పుట:Telugu Right to Information Act.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విధంగా నయినా సమాచారం అందకుండా అడ్డుపడ్డారని భావించినా ఆ కేంద్ర పౌర సమాచార అధికారి లేక రాష్ట్ర పౌర సమాచార అధికారిపై వారికి వర్తించే సర్వీసునిబంధనల కింద క్రమశిక్షణా చర్య తీసుకోవల్సిందిగా సిఫారసు చేయాలి.

ఛాప్టర్ VI

ఇతర నిబంధనలు

21. ఈ చట్టం కింద లేక ఈ చట్టం కింద రూపొందిన రూల్స్ కింద నుంచి చేస్తున్నానన్న నమ్మకంతో ఎవరేం చేసినా, చేసేందుకుఉద్దేశించినా అందుకు వారిపై ఎలాంటి దావాలు వేయడం, ప్రాసిక్యూట్ చేయడం, చట్టపరమైన చర్యలు తీసుకోవడం కుదరదు.
22. అధికార రహస్యాల చట్టం, 1923 అమలులో ఉన్న మరేదైనా చట్టం, లేక మరేదైనా చట్టం వల్ల అమలులో ఉన్న పత్రంలో ఈచట్టంతో పొసగని అంశాలు ఎలాంటివి ఉన్నప్పటికీ ఈ చట్టంలోని నిబంధనలు అమలులో ఉంటాయి.
23. ఈ చట్టం కింద ఎలాంటి ఆదేశం జారీ అయినా దానిపై దావాను గానీ, దరఖాస్తును గానీ, ఇతర విచారణలను గానీ ఏ న్యాయస్థానం చేపట్టరాదు. ఈ చట్టం కింద అప్పీలు చేయడం మినహాయించి ఆ ఆదేశాలను ప్రశ్నించడం కుదరదు.

24. (1) రెండవ షెడ్యూల్లో పేర్కొన్న ఇంటిలిజెన్స్, భద్రతా సంస్థలకు, ఆ సంస్థలు ప్రభుత్వానికి సమర్పించే ఎలాంటి సమాచారానికీ ఈచట్టం వర్తించదు. అవినీతి ఆరోపణలు, మానవహక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన సమాచారం అయిన పక్షంలో ఈ సబ్ సెక్షన్ నుండి మినహాయింపు ఉంటుంది. మానవహక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన సమాచారం కోరినప్పుడు కేంద్ర సమాచారకమిషన్ ఆమోదం తర్వాత మాత్రమే అలాంటిఅభ్యర్ధన అందిన దగ్గర నుంచి 45 రోజులలోగా, సెక్షన్ 7 లోని నిబంధనలతో నిమిత్తం లేకుండా, సమాచారంఅందించాల్సి ఉంటుంది.

(2) కేంద్ర ప్రభుత్వం తాను నెలకొల్పిన మరో ఇంటిలిజెన్స్ లేక భద్రతా సంస్థను, అధికార గెజిట్లో ప్రచురించడం ద్వారా, రెండవ షెడ్యూల్లోచేర్చవచ్చు. అలాగే ఇప్పటికే అందులో ఉన్న ఏదైనా సంస్థను తొలగించవచ్చు. అలాంటి నోటిఫికేషన్ ప్రచురించగానే ఒక సంస్థ షెడ్యూలు లో చేరినట్టుగానో లేక తొలగిపోయినట్లుగానో లెక్క.
(3) సబ్ సెక్షన్ (2) కింద జారీ చేసిన ప్రతి నోటిఫికేషన్ నూ పార్లమెంటు ఉభయసభల ముందు ఉంచాలి.
(4) రాష్ర్టప్రభుత్వం నెలకొల్పిన ఇంటలజెన్స్, భద్రతాసంస్థలకు ఈ చట్టం వర్తించదు. ఆ ఇంటిలిజెన్స్, భద్రతాసంస్థలను రాష్ట్రప్రభుత్వం అధికార గెజిట్లో నోటిఫికేషన్ ద్వారాపేర్కొన వచ్చు. అవినీతి ఆరోపణలకు సంబంధించిన సమాచారం అయినప్పుడు ఈ సబ్ సెక్షన్ నుంచి మినహాయింపు ఉంటుంది. మానవహక్కుల ఉల్లంఘనకు సంబంధించిన సమాచారం అయితే, రాష్ట్ర సమాచార కమిషన్ఆమోదం పొందిన తర్వాత, సెక్షన్ 7 లోని నిబంధనలతో నిమిత్తం లేకుండా, అభ్యర్థన అందిన నాటి నుంచి 45 రోజులలోగా ఆసమాచారం అందించాల్సి ఉంటుంది.
(5) సబ్ సెక్షన్ (4) కింద జారీచేసిన ప్రతి నోటిఫికేషన్ నూ రాష్ట్ర శాసనసభ ముందు ఉంచాలి.

25. (1) కేంద్ర సమాచార కమిషన్ లేక రాష్ట్ర సమాచార కమిషన్ ఆచరణలో ఎంత త్వరగా సాధ్యం అయితే అంత