పుట:Telugu Right to Information Act.pdf/15

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

సూచించిన తర్వాత, ఆ విచారణజరుగుతున్న సమయంలో సదరు ప్రధాన సమాచార కమిషనర్ లేక సమాచార కమిషినర్ ను సుప్రీంకోర్టు నివేదిక అంది ఉత్తర్వు జారీ చేసేంతవరకు రాష్ట్రపతి సస్పెండ్ చేయవచ్చు. అవసరం అనుకున్న పక్షంలో కార్యాలయంలోకి ప్రవేశించకుండా నిషేదించవచ్చు.

(3) సబ్ సెక్షన్ (1) లోని నిబంధనలతో నిమిత్తం లేకుండా ప్రధాన సమాచార కమిషనర్ ను లేక సమాచార కమిషనర్ ను రాష్ట్రపతి తన ఉత్తర్వుల ద్వారా ఈ కిందికారణాలతో పదవి నుంచి తొలగించవచ్చు.
(ఎ) దివాళా తీసినట్లు నిర్ణయమైనపుడు
(బి) ఏదైనా నేర నిరూపణ జరిగి, ఆ నేరం నీతి బాహ్యమైనదని రాష్ట్రపతి భావించినపుడు,
(సి) ఆర్థికలాభం కోసం పదవిలో ఉన్నప్పుడు తన విధి నిర్వహణలో సంబంధం లేని ఇతర పనులు చేసినపుడు,
(డి) శారీరకంగా లేకమానసికంగా దుర్బలులై పదవిలో కొనసాగేందుకు పనికిరాకుండా పోయారని రాష్ట్రపతి భావించినప్పుడు
(ఇ) ప్రధాన సమాచార కమిషనర్ లేక సమాచార కమిషినర్ తమ విధి నిర్వహణకు నష్టం చేకూర్చే అవకాశం ఉన్న ఆర్థిక ప్రయోజనాలనూ, ఇతరత్రా ప్రయోజనాలను పొందినపుడు
(4) కేంద్ర ప్రభుత్వం లేకదాని తరుపున చేసుకున్న ఏ ఒప్పందం, కాంట్రాక్టులోనయినా ప్రధాన సమాచార కమిషనర్ లేకసమాచార కమిషనర్ అయినా ఏ తరహాలోనయినా ఆసక్తి చూపించినా, కల్పించుకున్నాసబ్ సెక్షన్ (1)లో పేర్కొన్న అనుచిత ప్రవర్తన కు పాల్పడినట్లు లెక్క. ఏదయినా ఇన్ కార్పొరేటెడ్ కంపెనీ లాభాలు, ఆదాయాలు, రాబడుల్లో సభ్యుడిగా కాక మరో విధంగా పాలు పంచుకున్న సందర్భం కూడా అనుచిత ప్రవర్తన కిందకు వస్తుంది.


ఛాప్టర్ IV

రాష్ట్ర సమాచార కమిషన్

15. (1) ఈ చట్టం కింద సంక్రమించిన అధికారాలను వినియోగించేందుకు, అప్పగించిన బాధ్యతలను నిర్వహించేందుకు..... (రాష్ట్రం పేరు).సమాచార కమిషన్ అనే సంస్థను రాష్ట్రప్రభుత్వం అధికార గెజిట్లోనోటిఫికేషన్ ద్వారా స్థాపిస్తుంది.

(2) రాష్ట్ర సమాచార కమిషన్ లో కిందివారు ఉంటారు.
(ఎ) రాష్ట్రప్రధాన సమాచార కమిషనర్
(బి) పదిమందికి మించకుండా అవసరమైన సంఖ్యలో రాష్ట్ర సమాచార కమిషనర్లు
(3) రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ను, రాష్ట్ర సమాచార కమిషనర్లను ఒక కమిటీ సిఫారసు మేరకు గవర్నర్ నియమిస్తారు. ఆకమిటీలో కిందివారు ఉంటారు.
(i) ముఖ్యమంత్రి, కమిటీకి ఛైర్ పర్సన్ గా వ్యవహరిస్తారు.
(ii) శాసనసభలో ప్రతిపక్ష నేత
(iii) ముఖ్యమంత్రి నామినేట్ చేసే ఒక రాష్ట్ర క్యాబినెట్ మంత్రి.
(వివరణ : శాసనసభలో గుర్తింపు పొందిన ప్రతిపక్ష నాయకుడు లేకపోతే ప్రతిపక్ష పార్టీలో అతి పెద్ద పార్టీ నాయకుడిని ప్రతిపక్ష నేతగాపరిగణిస్తారు.)