పుట:Telugu Right to Information Act.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
(2) ప్రతి సమాచార కమిషనర్ పదవి చేపట్టిన నాటి నుంచి అయిదేళ్లపాటు లేక 65 ఏళ్ల వయస్సు వచ్చేవరకూ ఏది ముందయితేఅంతవరకూ పదవిలో ఉంటారు. పదవీ విరమణ తర్వాత పునర్నియామకానికి అవకాశం లేదు. ఈ సబ్ సెక్షన్ కింద పదవీ విరమణచేసే ఏ సమాచార కమిషనర్ కు అయినా సెక్షన్ 12, సబ్ సెక్షన్ (3) లో నిర్దేశించిన విధంగా ప్రధాన సమాచార కమిషనర్ గానియమితులయ్యే అర్హత ఉంటుంది. అలా ప్రధాన సమాచార కమిషనర్ గా నియమితులైన వ్యక్తి ఈ రెండు పదవుల్లోనూ కలపి అయిదేళ్లకు మించి పదవిలో ఉండరాదు.
(3) ప్రధాన సమాచార కమిషనర్ లేక సమాచార కమిషనర్ పదవిలో ప్రవేశించే ముందు రాష్ట్రపతి ఎదుటగానీ, ఈ పనికోసం రాష్ట్రపతి నియమించిన మరో వ్యక్తి ముందుగానీ మొదటి షెడ్యూల్లో పొందుపరిచిన పద్ధతిలో పదవీ ప్రమాణస్వీకారం చేయాలి.
(4) ప్రధాన సమాచార కమిషనర్ లేక సమాచార కమిషసర్ ఎప్పుడైనా స్వదస్తూరితో రాష్ట్రపతికి లేఖ రాసి పదవికి రాజీనామా సమర్పించవచ్చు. సెక్షన్ 14లో నిర్దేశించిన రీతిలో ప్రధాన సమాచార కమిషనర్ ను లేక సమాచార కమిషనర్ నూ పదవి నుండి తొలగించవచ్చు.
(5) వేతనాలు, అలవెన్సులు, ఇతర సర్వీసు నియమ నిబంధనలు :
(ఎ) ప్రధాన సమాచార కమిషనర్ కు ప్రధాన ఎన్నికల కమిషనర్ తో సమానంగా ఉంటాయి.
(బి) సమాచార కమిషనర్ కు ఎన్నికల కమిషనర్ తో సమానంగా ఉంటాయి. ప్రధాన సమాచార కమిషనర్, సమాచార కమిషనర్ నియమితులైన సమయంలో, గతంలో కేంద్ర ప్రభుత్వం కింద లేక రాష్ట్ర ప్రభుత్వం కింద చేసిన సర్వీసుకు పెన్షన్ తీసుకుంటున్నట్లయితే (వికలాంగులు,గాయపడిన వారికి ఇచ్చే పెన్షన్ కాకుండా) ఒకేసారి చెల్లింపు కోసం మార్పించుకున్న పెన్షన్ , గ్రాట్యుటీ మినహా ఇతర పదవీవిరమణ లాభాలతో సమానమైన పెన్షన్ సహా ఆ మొత్తాన్ని వేతనం నుంచి మినహాయిస్తారు. ప్రధాన సమాచార కమిషనర్, సమాచారకమిషనర్లు తమ నియామక సమయంలో, గతంలో కేంద్ర చట్టాల కింద లేక రాష్ట్ర చట్టాల కింద ఏర్పాటైన కార్పొరేషన్లలో చేసిన సర్వీసుకూ లేక కేంద్ర ప్రభుత్వ లేదా రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యంలోని లేక నియంత్రణలోని ప్రభుత్వ కంపెనీలలో చేసిన సర్వీసుకు పదవీ విరమణ లబ్ది పొందుతున్నట్లయితే ఆ లబ్దికిసమానమైన పెన్షన్ మొత్తాన్ని మినహాయించి వేతనం చెల్లిస్తారు. ప్రధాన సమాచార కమిషనర్, సమాచార కమిషనర్ల నియామకంతర్వాత వారి వేతనాలు, అలవెన్సులు, సర్వీసు నియమ నిబంధనలను వారికి నష్టం కలిగించే రీతిలో మార్చడం జరగదు.
(6) ఈ చట్టం కింద నిర్వహించాల్సిన కార్యాలను సమర్ధవంతంగా నిర్వహించడం కోసం అవసరమైన అధికారులనూ , ఉద్యోగులనూ కేంద్రప్రభుత్వం ప్రధాన సమాచార కమీషనర్ కూ, సమాచార కమిషనర్లకూ అందిస్తుంది. ఆ అధికారులుకూ, ఉద్యోగులకూ చెల్లించాల్సిన వేతనాలు, ఎలవెన్సుల విషయంలో, సర్వీసు నియమనిబంధనల విషయంలో నిర్ణీత పద్ధతిలో వ్యవహరిస్తారు.

14. (1) నిరూపిత అనుచిత ప్రవర్తన, అశక్తత కారణాలతో సబ్ సెక్షన్ (3)లోని నిబంధనలకు లోబడి ప్రధాన సమాచార కమిషనర్‌ను,లేక ఏ సమాచార కమిషనర్ ను అయినా రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా మాత్రమే పదవి నుంచి తొలగించవచ్చు. రాష్ట్రపతి సూచనమేరకుసుప్రీంకోర్టు విచారణ జరిపి అనుచిత ప్రవర్తన లేక అశక్తత కారణంతో ప్రధాన సమాచార కమిషనర్ లేక సమాచార కమిషనర్‌ను పదవి నుంచితొలగించవచ్చని చెప్పిన తర్వాత రాష్ట్రపతి ఆ ఉత్తర్వును జారీ చేయాలి

(2) సబ్ సెక్షన్ (1) కింద ప్రధాన కమిషనర్ లేక సమాచార కమిషనర్ పై విచారణకు సుప్రీంకోర్టుకు