పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/797

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శిక్షణ పొందిన కళాకారులు మిక్కిలినేని, మాచినేని, చదలవాడ, పెరుమాళ్ళు, కేశవరావు, అమృతయ్య, ఏసుదాసు మొదలైన వారు. కోగంటి, కోసూరి పున్నయ్య శిరివిసెట్టి సుబ్బారావు మొదలైనవారు శిక్షణ ఇచ్చారు.

ఎన్నో శిబిరాలు:

ఆ శిబిరం తరువాత కృష్ణా జిల్లాలో ఎన్నో శిబిరాలు నడిచాయి. ఎందరో కళాకారులు తయారయ్యారు. ఎన్నో బుర్రకథ దళాలు, పాటలు పాడే దళాలు, చిత్ర విచిత్ర కళారూపాల దళాలు తయారయ్యాయి. కేవలం పురుషులే కాక స్త్రీల దళాలు, బాలాబాలికల దళాలు కూడ ఏర్పడ్డాయి. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో, మోటూరు ఉదయం దళం, రష్యన్ వీరనారి టాన్యా బుర్రకథను చెప్పేవారు, అలాగే కొండేపూడి రాధ, తాపీ రాజయ్య, వీరమాచనేని సరోజని, దళం అల్లూరి సీతారామ రాజు బుర్రకథను అత్యద్భుతంగా చెప్పేవారు.

ఓ, మిట్టిపడే హిట్లరయ్యా?:

ఓ గుఱ్ఱాల గోపిరెడ్డి అనే పాత గేయం బాణీలో హిట్లరును గురించి సుంకర గేయం వెలువడింది.

ఓ, మిట్టిపడే హిట్లరయ్య
ఏటికీ ఎదురీదుచుంటివా ॥ఓ॥

కూలిరాజ్యం కూల దోసీ
నీదు రాజ్యం నిలప బోతే
సేనలన్నీ చెదరిపోయేనా॥ఓ॥

కూలి రైతుల పాలి స్వర్గం
నేలమట్టం చేయబోయి
కాలు జారీ నేలబడితివా॥ఓ॥

అలాగే కోలాట కీర్తన:

మాస్కో పొలిమేర లోనా, మారణ యంత్రాలు నిలిపి
మాడ్చేవేసెరా రెడార్మీ పూడ్చేవేసెరా ॥మా॥