పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/792

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వెలువడ్డాయి. అవి మహాత్మా గాంధి ప్రబోధ పద్యాలు, ఆల్లూరు సీతారామరాజు పాటలు, మహాత్ముని ఉద్యమవాణి, స్వరాజ్యాందోళనము, భారతమాత పలుకు, రామదండు భజన పాటలు, గాంధీ జీవితము, స్వరాజ్య భక్తి కీర్తనలు, తిలక్ హరికథ, స్వరాజ్య దర్పణం ఇలా ఎన్నో జాతీయ గేయ సాహిత్య సంకలనాలు వెలువడ్డాయి.

జాతీయ నాటకాలు:

ఆరోజుల్లో చిలకమర్తి, తిరుపతి వెంకట కవులు, భారత గాథలకు చెందిన నాటకాలు, అలాగే భారత చారిత్రక వీరుల గాధలైన "శివాజీ" "రాణా ప్రతాప్" "మేవాడ శౌర్యాగ్ని" "బొబ్బిలి యుద్ధం" "రోష నార" మొదలైన గాంధీ బోధనలనూ, కాంగ్రెసు ఉద్యమాన్ని ప్రబోధించే దామరాజు పుండరీకాక్షుడు గారి పాంచాల పరాభవం, గాంధీ విజయం, గాంధీ మహోదయం మొదలైన నాటకాలే కాక ఆంధ్ర మాత, సంస్కారిణి, స్వరాజ్య పతాకం, చీరాల పేరాల గాంధి, మొదలైన నాటకాలను ప్రచారంలోకి తెచ్చారు. అలాగే శ్రీ పాద వారి విజయధ్వజ నాటకం, ముద్దూరి అన్న పూర్ణయ్య, చిచ్చుల పిడుగు, 1957 సిపాయి తిరుగు బాటు నాటి మంగళ పాండ్యా గాథను ఆమంచర్ల గోపాల వారు మొదలైన రచయితలు చెప్పుకో తగిన నాటకాలను వెలువరించారు. అయితే వీటిలో చాలవరకు ప్రదర్శన యోగ్యం కాలేదు.

ఎవరికి వారు ఒకే సమస్య మీద కేంద్రీకరించి స్థానికంగా కథలు, గేయాలను వ్రాసి పాడారు గానీ అవీ రాష్ట్ర వ్యాపితం కాలేదు. అలాగే నాగరికత అభివృద్ధి చెందిన సర్కారు ప్రాంతాల పట్టణాలలో ప్రభావితులైన మేధావులు మొదలైన వారు తప్ప ఉవ్వెత్తున గ్రామాలలో ఈ వుద్యమం సాగలేదు.


నాటి వైజ్ఞానిక ఉద్యమం:

నాటి సత్యాగ్రహ ఉద్యమంలో ఇలా ఎందరో వారి వారి కవితాధారలను కురిపించారు... అయితే ఎక్కడి కక్కడే బృందాలుగా, వ్వక్తులుగా వారీ కార్యక్రమం జరిపారు కానీ, రాష్ట్ర వ్వాపితంగా ఈ వైజ్ఞానిక కార్య క్రమం సంఘటిత ఉద్యంమంగా రూపు దాల్చ లేదు. అలా అని పల్లెలకు పోకుండానూ లేదు. నాటి సత్యాగ్రహ ఉద్యమం సాగిన ప్రతి పల్లె టూరులోనూ వలంటీర్లు పాటలను ఉద్వేగంగా పాడి బ్రిటీష్ ప్రభుత్యం మీద వ్వతిరేఖతను కలిగించారు. ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్వతిరేకంగా వ్రాయటమూ పాడటమూ సాహస వంతమైన విషయం. అయితే ఒకరిద్దరు రచయితలు "బుర్రకథ _ హరికథ_