పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/782

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


కరీంనగర్ జిల్లా

కరీంనగర్ జిల్లాలో నుస్తురాపూర్, జాగిర్ల, మొగిలి పాలెం, గంగిపల్లి, మాన కొండూరు, గోపాల రావు పల్లె, వెదురు గట్ట మొదలైన గ్రామాలలో యక్ష గాన దళాలు, తోలు బొమ్మల ఆటలు ఆడే దళాలు పనిచేశాయి.

TeluguVariJanapadaKalarupalu.djvu

హుజూరాబాద్ కు దగ్గరలో నున్న తాటికంటి మొదలైన చోట్ల వీధి నాటక దళాలు పనిచేశాయి. హుజూరాబాదుకు ఆరు మైళ్ళ దూరంలో వున్న మాణిక్యాపూర్ లో విప్ర వినోదులు ఒకప్పుడు ముప్పై కుటుంబాల వారున్నారు. పదిహేను మైళ్ళ దూరంలో వున్న వల్లభాపురంలో సాధనాసూరులు పద్మసాలి కుటుంబానికి చెందిన వారున్నారు. ఈ తాలూకాలో ప్రతి గ్రామంలోనూ చిరుతల రామాయణం కళారూపం బహుళ ప్రచారంలో వుంది.

జగిత్యాలకు గద్దరలో నున్న భీమారం, బల్ల కోడూరు, కొండపల్లి, రాయికాల్, భాల్ గడ, దుల్యాల్, కోడూరు పల్లి మొదలైన చోట్ల యక్షగాన దళాలు పనిచేశాయి. బుగ్గారం గ్రామం లోనూ చిరుతల రామాయణం కోలాటం దళాలు విరివిగా వున్నాయి ఒకనాడు.

పైన ఉదహరించిన కళారూపాల్లో వెంకట రెడ్డి, దావూరి వెంకటాచారి, శంకరయ్య, మనోహారాచార్య, లక్ష్మికాంత శాస్త్రి, పేట కాంతయ్య, చంద్రమౌళి శాస్త్రి, అనంతయ్య మొదలైన కళాకారులు పని చేశారు.

ముట్టుపల్లి తాలూకాలో అనేక గ్రామాల్లో భాగవత దళాలు పని చేశాయి. ఇటికాల్, నత్తారం, తక్కెడపల్లి, శ్రీకొండ, శ్రీపురం, మానపల్లె, వెల్లుట్ల, మన్నెగూడెం మొదలైన గ్రామాల్లో భాగవత దళాలు పనిచేశాయి.

శిరిసిల్ల తాలూకా బూరుగు పల్లి, హనుమాజి పేట, నూకలదుఱ్ఱి గ్రామాల్లో యక్షగాన దళాలు పనిచేశాయి.