పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/76

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


వుండేవారట. నగ్నంగా వున్న ఈ విగ్రహం ముందు స్త్రీలు కూడ నగ్నంగా పూజిస్తూ నాట్యం చేస్తూ వుండేవారట.

ఈ రేణుకాదేవే, తరువాత ఎల్లమ్మగానూ, ఏకవీర గానూ ప్రసిద్ధి చెందింది. ఏకవీర ఆలయాలు మండపాక, పొలవాన, మాహూరు మొదలైన గ్రామలలో వెలసి వున్నట్లు క్రీడాభిరామంలో ఉదహరించబడి వుంది.

కాకతీయ రుద్రమదేవి మొగిలిచర్లలో వున్న ఏకవీరాదేవీ ఆరాధించడానికి వెళుతూ వుండేదట. ఓరుగల్లు పట్టణంలో ఏకవీరాదేవి మహోత్సవాలను కూడ తిలకించేదట.

గొండ్లి అనేది కుండలాకార నృత్యం. గొండ్లి విధానం ద్వారా బతకమ్మ, బొడ్డెమ్మల వుత్సవ సమయాల్లో పిల్లన గ్రోవులూదుతూ, ఆటలు ఆడుతూ, కుండలాకార నృత్యం చేసేవారు.

గొరగపడుచులు గొప్ప నాట్యాలు:

ఓరుగల్లు మైలారదేవుని పూజల సమయంలో, మైలారదేవుని కొలిచే గొరగ పడుచులు పాటలు పాడుతూ, ఒక నీటి పాత్రలో ఒక వస్తువును వేసి, మొగ్గవాలి వెనుకకు వంగి నాలుకతో ఆ వస్తువు నందుకుని ఆవిధంగా తమ ప్రజ్ఞను భక్తిపరస్పరంగా తెలియజేశేవారట. ఈ విధానాన్ని గూర్చి క్రీడాభిరామంలో.

చ.వెనుకకు మొగ్గవాలి కడు విన్ననువొప్పగ దొట్టెనీళ్ళలో
మినిగి తదంతరస్థమాగు ముంగర ముక్కున గ్రుచ్చి కొంచు లే
చెను రసనా ప్రవాళమున శీఘ్రము గ్రుచ్చెను నల్లపూస పే
రనుసమలీల నిప్పడుచుపాయము లిట్టివి యెట్లు నేర్చెనో.

ఇక పురుషులు వీరభద్రస్వామిని నెత్తిమీద పెట్టుకుని ప్రభలుగట్టి అడుగుల మడుగులతో, నగారా డోళ్ళు వాయిస్తూ నారసాలు పొడుచుకుని నృత్యం చేసేవారట. వీరిని గురించి__

వీరు మైలారదేవభటులు. గొండ్లి యాడించుచున్నారు. గొరగపడుచు వాడుచున్నది చూడు మూర్థాభినయము. తాను వెట్టిక పీలంతగాని లేదు.

(క్రీడాభిరామం)