పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/754

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అని, ఎన్నియాలో అనీ, చందమామా అని వంతలు ఉపయోగించే వారు. ఉయ్యాలో అనడం వల్ల అది ఉయ్యాల పాట కాదు. వంత మాత్రమే. పోరాట కాలంలో ఎక్కువగా, అమర వీరుల మీదే ఈ పాత బాణీలతో పాడుకున్నారు. ఉదాహరణకు.

వీరామట్టా రెడ్డి ఉయ్యాలో__
ధీర అనంతా రెడ్డి ఉయ్యాలో__

అంటూ సాగుతుంది.


భట్రాజు పొగడ్తలు

TeluguVariJanapadaKalarupalu.djvu

ఇప్పటికీ ఒరే ఆ భట్రాజు పొగడ్తలు మానరా అనడం మనం పరిపాటిగా వింటూనే వున్నాం. వెనుకటి మాదిరిగా ఈనాడు భట్రాజులు తక్కువై పోయారు. ఆనాటి ప్రతి రాచకొలువులోనూ భట్రాజులు విధిగ వుండేవారు. కొలువులో వంది మాగధ స్తోత్రాలు చదువుతూ వుండేవారు. ఆనాటి కొలువులో వారొక అలంకారం. వారి రాజులు వంశ చరిత్రనంతా వల్లిస్తూ బిరుదులు చదువుతారు. వీరు ఆసుకవులు. అప్పటి కప్పుడు సన్ని వేశ ప్రాధాన్యాన్ననుసరించి పద్యాలు మధురంగా పాడుతారు. వేషధారణను ముచ్చటగా దిద్దుకుంటారు. వీరిని తెలుగులో భట్టులంటారు. రాజుల కొలువులో వుండటం వల్ల భట్రాజులుగా పేరు సార్థకమై వుండవచ్చు. వీరి పేరు చివర రాజు లేక మూర్తి అనే పదాలను చేర్చుకుంటారు. కాకతీయుల కాలం నుంచీ వీరున్నారు. కాకతీయ సామ్రాజ్యం చితికిపోయిన తరువాత చెల్లాచెదురై వెలమ, కమ్మ, కాపు కులస్తులను ఆశ్రయించారు. చిన్న చిన్న సంస్థానాధీశుల పంచన చేరారు. యుద్ధ యాత్రల్లో వీరు వీర గీతాలను ఆలపించేవారు. వీరమరణం చెందిన వీరుల సాహస కృత్యాలను ఆశువుగా వర్ణిస్తారు. తెలుగు ప్రజల వాస్తవ చరిత్రను పద్య రూపంలో భద్రపర్చినవారు వీరే.

వీరు ఎవరి పోషణలో వుంటారో, వారి ఇళ్ళలో జరిగే పెళ్ళి కార్యక్రమంలో పెళ్ళి కొడుకును అలంకరించి పెళ్ళి పీటల మీద కూర్చోపెడతారు. తెలుగు సాహిత్యంలో గణనీయమైన కావ్యం వ్రాసి తరువాత వాళ్ళకు పరవళ్ళు పెట్టిన కవి భట్టుమూర్తేనని ఆరుద్ర గారంటారు.