పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విష్ణుకుండిన రాజులు కేవలం సాహిత్య పోషకులే కాక కళాపోషకులు కూడాను. వీరు హిందూ గుహాలయాలను నిర్మించి వాస్తుశాస్త్రానికి ప్రాముఖ్యమిచ్చారు. విజయవాడ వద్ద మొగల్ రాజపురంలో బహుబాహువులు కలిగిన నట రాజమూర్తి శిధిలావస్థయందున్నప్పటికీ కళా దృష్టిలో మాత్రం నిరుపమానమైంది.

వీరి తరువాత ఆంధ్రదేశాన్ని పరిపాలించినవారు కళింగ రాజులు. వీరి పాలనలో లలితకళా వికాసం ఏటువంటిదో మనకు తెలియరావడం లేదు.