పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/491

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దీపావళి నెలలో సాంప్రదాయకమైన ఈ నృత్యం జరుగుతుంది, పౌర్ణమి నాడు కార్యక్రమం ప్రారంభ మౌతుంది. చతుర్దశి వరకూ జరుగుతుంది.

గుసాడి నర్తకునికి కావలసిన సామగ్రిలో ముఖ్యమైనది నెమలి పించంతో తయారు చేసిన తలపాగా. ఇదులో గొర్రెపోతు కొమ్ములను కూడ అమర్చుతారు. కృత్రిమ గడ్డాలు మీసాలతో వేషం కడతారు. మేక తోలు కప్పుకుంటారు.