పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/461

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రావయ్య రారాజ రాణి ఇచ టున్నాది
నీ దుష్ట చర్యలను దునుమాడు కొరకు
కన్ను గోరిన కయ్న గద్దెపై నున్నాది
పట్టుమోయ్ శక్తుంటే పటుతరము మీర
నను బట్ట నీఛుడా - నీచేత గాకుంటే
నిండు సభలో అగ్ని గుండాన చావు.

అని కన్యక రాజును సవాల్ చేసి, ప్రజలకు రాజు దారుణాలను వివరిస్తుంది. కానీ రాజుకు భయపడిన ప్రజలలో స్పందన కనిపించదు. అంతట కన్యక ....

మండెడు గుండముకు - ముందు దండము పెట్టి
గుప్పించి యా తల్లి గుండాన దూకింది.
అగ్నిలో అ తల్లి ఆహుతై పోయింది.

ప్రజలు క్రోధాగ్నితో లేచారు.

కాడెలు, మేడేలూ,
కత్తులూ, సుత్తూలు,
బాకులా బల్లెములా,
పట్టియా రాజును
ప్రాణాలే తీసిరా

అంతటితో,

రాలిపోయేను రాజూ
కూలిపోయేను కోటలూ
రాణు వల్లు, రాణియలు
రాలిపోయేరు నాడే

మిక్కిలి నేని దళం:

ఇలా నవరసాలను ప్రతిబింబించే ఈ జముకుల కథను రసవత్తరమైన ఈ జముకుల కథను నాటి ప్రజానాట్య మండలి స్థాపకుల్లో ముఖ్యులైన మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, మాచనేని వెంకటేశ్వరరావు, పట్టంశెట్టి ఉమామహేశ్వరరావు మొదలైన వారు లక్ష్మణరావు