పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/460

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


వివరాలన్నీ ఆ ప్రాంతంలో వున్న ఒక బృందం చెప్పిన వివరాలన్నిటినీ ఛాయారాజ్ సేకరించారు. వారికి ధన్యవాదాలు.

పీసా లక్ష్మణరావు, కన్యక:

జముకుల కథ కళారూపాన్ని దేశ ప్రయోజనాలకు ప్రప్రథమంగా మార్చిన వ్వక్తి విజయ వాడ కమ్యూనిస్టు కార్య కర్త, ప్రజానాట్య మండలి సభ్యుడు కీ॥ శే॥ పీసా లక్ష్మణ రావు. మహారాజుల వ్వస్థలో ప్రబలిన దారుణ హింసా కాండనూ, సాంఘిక దురాచారాలనూ ఉదహరిస్తూ గురుజాడవ్రాసిన 'కన్యక ' గేయాన్ని ఇతి వృత్తంగా తీసుకుని, కన్యక జీవిత గాథను కథగా మార్చి దానిని జముకుల కథగ వ్రాసి మంచి మంచి బాణీలను ఏర్చి కూర్చి రసవత్తరంగా కథా గానం చేసేవారు ఆయన వంత దారుగా రాజకీయ వ్యాఖ్యాతగా వ్వవహారిస్తే నరసింహా రావు కథకుడుగా, తొత్తడి సింహాచలం హాస్యాన్ని అందించేవాడు. అది అద్భుతమైన కథగా నాటి సాంఘిక రాజకీయ పరిస్థితులన్నిటికీ అద్దం పట్టింది.

కథాగాన సరళి:

కన్యకాన చరితం, కర్ణానందం
నిను స్మరియించెడు జనుల కెల్ల నిత్యానందం.

అని ప్రార్థనతో ప్రారంభించి

కళింగ డేశ మీ తెలుగు గడ్డపైన
విష్టువర్థను డనుచు వెలయుచెండేనుగా.

అని వివరిస్తూ

పండిన తన కేమి, మండిన తన కేమి
పన్నులె కావాలి ప్రభువు వారలకు
పన్ను లివ్వాలేని పేద రైతుల నెల్ల
రచ్చ చావడి కీడ్చి రువ్వలతో భాదించు
వన్నెగల స్త్రీ ఒకతె కన్ను కగుపించిన
కామాంధుడై ఒళ్ళు కాన డారాజు.

అలాంటి విష్ణువర్థన మహారాజు కన్యకను కోరటం, కన్యక నిరాకరిస్తూ రాజును ఇలా సంబోధిస్తుంది.