పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/457

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఒకసారి ప్రదర్శన జరుగుతూ వుండగాకథకుని చేతిలో రుమాలు తీసుకుని కథను సాగించమన్నారట. వాళ్ళు బొమ్మల్లా నిలుచుండి పోయారట. అడుగు కదలలేదట. రాగం రాలేదట, రుమాలు లేకుండా కథ చెప్పలేమన్నారట.

రుమాలు తమాషా:

బుడి కథలో కథకునికి రుమాలు ఒక అవయవం లాంటిది. అది చేతిలో లేక పోతే చెయ్యి విరిగి పోయినట్లే. ఆ యా సన్నివేశాల్లో అది ఒక పాత్రగానే వ్వవహరిస్తుంది. ఒకోసారి కర్పూరం వెలిగించిన పళ్ళె మవుతుండట, వాయినం అందించే పాత్రగా మారుతుందట. ఒకోసారి ఆకాశంలో చంద మామగా, మరోసారి సిగ్గును దాచుకోడానికి. మరోసారి గుఱ్ఱాలను అదిలించే చర్నా కోలలా రూపొందుతుంది. ఇంకోసారి రాయబారాన్ని పంపే హంసగా. పావురంగా, చివరకు ఉత్తరంగా దుఃఖ రసంలో కళ్ళు అద్దు కోవడానికి, శృంగారంలో వయ్యారంగా ఊగించడానికీ, ఇలా ఎన్నోవిధాల ఆయా రసాల, అభినయాల, సన్నివేశాల కనుగుణంగా చేతిలోని రుమాలు ప్రముఖ పాత్ర వహిస్తుంది.

బుడికి రంగస్థలం:

ఈ కళారూపాన్ని గూడేలలోనూ, గ్రామాలలో కూడలి వద్దా, నలుగురూ కూర్చుండే రచ్చబండల వద్దా ప్రదర్శిస్తారు. కథ ప్రారంభమై తెల్ల వార్లూ నడుస్తుంది. ప్రదర్శనా రంగ స్థలంలో ఒక దీపపు స్థంభాన్ని పాతుతారు. దీనిని గిరడ అని పిలుస్తారు. ఈ గిరడ చుట్టూ వలయాకారంగా తిరుగుతూ, పాడుతూ, కథకుడు నృత్యం చేస్తూ కథ చెపుతాడు.

ఇప్పుడిప్పుడు గిరడకు బదులు, పెట్రొమాక్స్ లైట్లు స్టూలు మీద వుంచి దానినే గిరడగా భావించి చుట్టు తిరుగుతూ ప్రదర్శన ఇస్తున్నట్లు ఛాయారాజ్ గారు చెపుతున్నారు.

గిరడ ముందు ప్రార్థన:

ముందుగా కథకుడు గిరడకు ఎదురుగా నిలబడి ప్రార్థన చేసి నెమ్మదిగా నాట్యం ప్రారంభించి అప్పటి వరకూ కప్పుకున్న మేలి ముసుగును తొలగించి ఆనం