పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/437

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


గోండులే గాక, ఇతర అడవి జాతుల వారు కూడ ముఖ్యమైనదిగా ఎంచి నృత్యం చేస్తారు. ఈ విధంగా నృత్య గీతాలతో "ఖర్మ వృక్షాన్ని ఆరాధించి భగవంతుని సంతోష పెడితే పంటలు దండిగా పండు తాయని వారి విశ్వాసం.

TeluguVariJanapadaKalarupalu.djvu
బృంద నృత్యం

ఇది కేవలం బృందనృత్యం, స్త్రీలు, పురుషూ కలిసి చేసే నృత్యమిది. ఈ నృత్యం 'చతురశ్ర' 'తిశ్ర' ఏక తాళ గతిలో చేయ బడుతుంది.

వీరి గీతాలు కొన్ని అధ్యాత్మిక పరంగానూ కొన్ని ప్రణయ గీతాలు గానూ, మరి కొన్ని హాస్యరస ప్రాధాన్యత కలిగినవి గానూ వుంటాయి. వారి పాటలీ విధంగా వుంటాయి.

నీ శరీరమును చూచి పొంగకయ్యా
అది ఒకారోజు పైకి పోవాల్సిందేగా
నీ తల్లి దండ్రీ చుట్టములు, బంధువులు
అందరిని విడిచి పోవాలి
నీ యింటిలో నున్న లక్షల ఆస్తిని గూడా
మరణ కాలంలో వదలి పోవాలి.