పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/373

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఈ సంభాషణంతా చాలవరకు సంస్కృత భాషలోనే నడుస్తూ వచ్చినా అక్కడక్కడ తెలుగు కీర్తనలు పాడుతూనూ, దీనిని ప్రదర్శిస్తారు. ఇరువురు గంధర్వ కన్యలు వనవిహారాని కొచ్చి పూల తోటలో పూల బంతు లాటలు ప్రారంభించి ఋతువుల్ని గురించి పూవులను గురించీ, చెట్లను గురించీ, రక రకాల వర్ణనలు సాగించడం రూపంగా ఇది నడుస్తుంది. ఈ ప్రదర్శనం ప్రేక్షకులకు గుమ్మెక్కించే టట్లు ప్రదర్శిచాలంటే ఆ కన్యలిద్దరూ మిసమిస లాడే యౌవన వతులై వుండాలి. అప్పుడే ఆయొక్క ప్రదర్శనానికి నిండుదనం వచ్చేది; ప్రదర్శనం రక్తి కట్టేది;

గొల్లకలాపం కానీ, వనవిహారం కాని ప్రదర్శించాలంటే ముఖ్యంగా సంస్కృతాంధ్ర భాషలు క్షుణ్ణంగా వచ్చితీరాలి. సరియైన విద్యా, విద్యకు తగిన విజ్ఞానమూ, దానికి తగిన సంస్కారమూ, కట్టు తప్పని పట్టుకలా కావాలి. శ్రుతి తప్పని సంగీతమూ, తొట్రుపడని, మట్టుమీరని సరియైన ఉచ్ఛారణా కావాలి.

మారం పల్లి వారిని మనవారు మరువరు మరువలేరు.

ఈ విద్యను చెక్కు చెదరకుండా మూడు తరాలుగా చిత్తజల్లు వారి కుటుంబం కాపాడుకుంటూ వచ్చింది. ఆనాడు ఏభై ఏళ్ల పండు వృద్దురాలు చిత్తజల్లు పెద వెంకట రత్నమ్మ తప్ప ఆ కుటుంబంలోని వారందరూ మరణించారు. గొల్ల కలాప కళాఖండం వారితో పాటే అంతరించింది. ఏమైనా నూరు సంవత్సరాల నుంచీ గొల్ల కలాప ప్రదర్శనాన్ని పెంచి పోషించి, ఆంధ్రదేశ మంతటా ప్రదర్శించి ప్రఖ్యాతి

TeluguVariJanapadaKalarupalu.djvu

వహించిన మారంపల్లి వాస్తవ్యులు చిత్తజల్లు సోదరీమణులూ, రావూరి కామయ్య సోదరులూ స్మరణీయులు. వర్తమానంతో పాటు భవిష్యత్ సహా ఆంధ్రదేశం వారిని, వారి కళా సేవను మరువ జాలదు.

చాటపర్తి సుందరి శకం:

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వాసవ్యు రాలైన చాట పర్తి సుందరిది ఒక శకం. ఆమె దేవదాసి. ఒక మేళానికి నాయకురాలుగా వ్వవహరిస్తూ వుండేది. ఆమె కచేరీ