పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/349

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రయాగ నరసింహశాస్త్రి, రెడ్డి, చిన వెంకట రెడ్డి, ఎనమండ్ర సుబ్బారావు, దంటు కృష్ణమూర్తి, నదీరా మొదలైన వారెందరో సాంఘిక రాజకీయాలకు సంబందించిన బుర్ర కథలను ఎన్నిటినో రచించారు.

గుమ్మెట్ల వాయిద్య:

ముఖ్యంగా జంగం కథలకు గానీ, బుర్రకథలకుగానీ జీవం పోసేది గుమ్మట్లను ధరించిన వంత దారులే. బుర్రకథను దద్దోతిమి అనే మూడు దెబ్బలతో కూడ కథను చెప్పవచ్చు కానీ ఈ గుమ్మెట వాయిద్యాన్ని శాస్త్రీయమైన వరుసలతో కనువిందు చేస్తారు. ఈ వాయిద్యంలో ఖమ్మం వాస్తవ్యుడు బుర్ర పంతులు గుమ్మెట మీద అన్ని ధ్వనులనూ శాస్త్రీయంగా పలికిస్తాడు. సన్నివేశానికి అనుగుణంగా ధ్వనులను పలికించ గలరు. అలాగే దొడ్డారపు వెంకట స్వామి వంతదారు. తాడికొండ సుబ్బయ్య, యల్ల మంద గార్లు గుమ్మెట్ల వాయిద్యంలో సిద్ధహస్తులు. యల్లమంద వద్ద మిక్కిలినేని, మాచినేని అనేక వరుసల్ని నేర్చుకుని ప్రజానాట్య మండలి దళాలకు శిక్షణ ఇచ్చారు. ఎంతో సాధన చేస్తేగానీ, ఈ వరుసలు అంకెకు రావు. కథకు ఈ వరుసలే ప్రాణం. ఉదాహరణకు....

దద్దో తిమి, దద్దో తిమి
తక తక్క తక తక్క.
తక తక్క తత ధిమి
తక తకిట్ట తక్కిట తక్కిట
తక త్గకిట్ట తక్కిట తక్కిట
తక తక్కిట,దరికిట తక్కిట్ట,
త, ఝుణం తకత, ఝుణ తకత.
త, ఝుణం తక తకత ఝుణం తక్కిట త.
దరికిట తక్కిట్ట, ధిత్తరికిట తక్కిట్ట,తక దరికిట తక్కిట్ట.
ధిత్తరికిట తక తరికిట, ధిత్త్తరికిట తక దరికిట
తకిట తకిట తక _ఇదే _దిం తత ధిమి తక
దరికిట దరికిట _ ధోంకి తధోంకి.
తక ధింతక, దరికిట ధింతక