పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/339

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉదాహరణల ననుసరించి, బుర్ర కథ కన్నడ మహారాస్ట్రాల నుంచి గాని, మరే రాష్ట్రం నుంచి గాని దిగుమతి కాలేదని స్పష్టమౌతోంది.

బుర్రకథ:

జానపద వాఙ్మయంలొ జంగం కథల సాహిత్యం ఒక ప్రత్యేక స్థానాన్ని వహిస్తూ వుంది. ఈ సాహిత్యంలో చాల రకాలు కనిపిస్తున్నాయి. చాలవరకు పూర్వపు యక్షగానాల్లో ఇతి వృత్తమంతా పురాణ గాథలకు సంబంధించింది యక్షగానాలు బుర్ర కథలుగా అభివృద్ధి చెందిన తరువాత

ప్రజానాట్యమండలి బుర్రకథ దళం. కథకుడు ఉమామహేశ్వరరావు- వంతలు మిక్కిలినేని_మాచినేని

బొబ్బిలి యుద్ధం, పల్నాటి వీర చరిత్ర మొదలైన చారిత్రిక యుద్ధ కథలూ, బాలనాగమ్మ, కామమ్మ, చిన్నమ్మ, లక్ష్మమ్మ, తిరుపతమ్మ, జానకీ వాసం మొదలైన కరుణరస ప్రధానమైన పాతివ్రత్య గాథలూ, ఉత్తర గోగ్రహణం, వామన విజయం, దేవయాని చరిత్ర, అంబరీషోపాఖ్యానం మొదలైన భారత రామాయణ గాథలకు సంబంధించిన అనేక కథలూ వచ్చాయి.

ఆనాటి నుండి ఈ నాటివరకు జంగం కథలు ప్రచారంలో వున్నాయి. ఈ నాడు జంగం కథల పద్ధతిని రాజకీయ, సాంఘిక పరిస్థితులకు అన్వయించి ప్రచారం చేస్తు