పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/337

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రవేశం ప్రవేశ పెట్టబడి వుంది. అంటే ప్రవేశించే ప్రతి పాత్రా తన వూరు, పేరు తెలుపుతూ, 'వెడలె సత్య భామ ' అని స్త్రీ పాత్రలూ, 'వెడలె యమధర్మ రాజు' అని పురుష పాత్రలూ ప్రవేశించే వన్నమాట. ఈ దశలో పరిణామం చెందిన యక్షగానాలను యక్షగాన నాటకాలని, వీథి నాటకాలని పిలిచారు.

ఈ విధంగా యక్షగానాలు రచనలో, ప్రదర్శనలో అభివృద్ధి చెందుతున్నా మూల యక్షగాన మైన సంగీత రూపం బుర్ర కథగాను, హరికథ గానూ రూపొందింది. ఇందుకు వుదాహరణ _ హరికథా పితామహుడైన అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారు తమ కథలన్నిటినీ యక్షగానాలనే వ్వవహరించారు.

యక్షగానంలో సూత్రధారుడు, విదూషకుడూ వున్నట్లే బుర్ర కథలో వంత దారులు ప్రవేశించారు. యక్షగానంలో విదూషకుడు హాస్యం చెపితే బుర్రకథలో వంతదారు హాస్యం చెపుతాడు. ఆనాటి నుండి ఈనాటి వరకూ కొన్ని బుర్ర కథలను స్త్రీలూ కూడ చెప్పడం వల్ల ప్రేక్షకులను ఎక్కువగా ఆకర్షించగలిగేవారు.

ఈవిధంగా పరీశీలన చేసేటట్లయితే మూల యక్షగానం రూపాంతరం పొంది బుర్రకథగా పరిణామం చెందిందని శ్రీనివాస చక్రవర్తి గారు నాజరు సన్మాన సంచికలో వుదహరించారు.

మహారాష్ట్ర కళారూపమా;

ఈ బుర్ర కథ కళారూపం మహారాష్ట్రం నుండి మనకు దిగుమతి అయిందనే వాదం కూడా వుంది. చాళుక్య రాజులు తూర్పు కోస్తాను పరిపాలించిన రోజుల్లో పశ్చిమ దేశాన్నుంచి తూర్పుకు వచ్చిన చాళుక్య రాజులతో పాటు ఈ బుర్ర కథలు, తోలు బొమ్మలాటలు మొదలైన జానపద కళా రూపాలు దిగుమతి అయినాయని కొంత మంది చరిత్రకారుల అభిప్రాయం. కాని చరిత్ర గతిని బట్టి కొంచెం వెనుకకు వెళ్ళి