పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/331

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


బుర్రకథ అనీ, తంబురా కథ అనీ, తందాన కథ అనీ, గుమ్మెట్ల కథ అనీ, అనేక ప్రాంతీయమైన భేదాలతో పిలువబడుతూ వుంది. కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఈ నాడు జంగం కథలంటే చాల మందికి తెలియదు. బుర్రకథ అనే పేరు ఆబాల గోపాలానికి తెలుసు. అలాగే రాయల సీమ జిల్లాలలో బుర్ర కథ అంటే ఎవరికీ తెలియదు. అక్కడ తందాన కథ లనే వ్వవహరిస్తున్నారు. ఈ విధంగా జంగం కథ ప్రాంతీయ మైన భేదాలతో పిలువ బడుతూ వుంది. ఈ కథకు ఇన్ని పేరులు రావడానికి కారణం కూడ లేక పోలేదు.

TeluguVariJanapadaKalarupalu.djvu

ఈ కథల్లో ప్రధాన కథకుడు తంబురాను వుపయోగిస్తున్నాడు. ఆ తంబురాకు ఉపయోగించే బుర్రను బట్టి దీనికి తంబురా కథ అనీ, బుర్రకథ అనీ పేరు వచ్చి వుండవచ్చు. ఈ కథలో ఉపయోగించే గుమ్మెట్లను డక్కీలనీ, బుర్రలనీ వ్వవహరించడం వల్ల ఈ కథలకు డక్కీ కథలు, బుర్రకథలు అనే పేర్లు సార్థకమై యుండ వచ్చునని కొందరి అభిప్రాయం.