పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/314

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డదికాల్పించి, ఎఱ్ఱగా కాల్చిన పలుగుల్నీ చేతితో దూయటం, ఇనపగుళ్ళు పళ్ళతో పట్టించటం, నెత్తిమీద పొయ్యి పెట్టి .... దాని మీద పెనం పెట్టి, గారెలు వండటం, ఇలా చూపరుల్ని ఆశ్చర్యంలో ముంచివేసే వాళ్ళు.

ఈ పనులు చేసేటప్పుడు వాయిద్యాలను ఉధృతంగా వాయిస్తూ, పాటలు పాడుతూ, కేకలు వేస్తూ

భాయి భాయిమే గారడి, భల్లె భల్లె గారడి
కట్టుమోతు విద్యలకు దిట్టమైన గారడి ॥భా॥

TeluguVariJanapadaKalarupalu.djvu
సున్నపు వీరయ్య పాములవాడి వేషం

ఇలా గారడి వాళ్ళు చేసే పనులు కూడా చేసి మాకు మంత్ర తంత్ర విద్యలొచ్చునని నిరూపించుకున్నారు. ఇవి రెండు వందల సంవత్సరాల నాటి మాట.

ప్రతిభకు ప్రతిఫలం:

కూచిపూడి పగటి వేషధారులు ప్రదర్శనాలన్నీ అయిన తరువాత చివరి రోజున శారద రామాయణం కథగా చెప్పి, పారితోషికాల కోసం ఇంటింటికీ తిరుగుతూ, కూచిపూడి ప్రశస్తిని ఈ విధంగా వివరించేవారు.