పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/307

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


కమ్మని కమ్మని కళలను జూపే
కళాక్షేత్రమే మాదయ్యా
కళాకారులము మేమయ్యా,
అబ్బో, - ఓ అబ్బో -ఓ -లబ్బో
పుట్టుక కళలను మాది
పొట్టల నింఫుట మీది
కోటకు దీటుగ కళల కెల్లను
కూచిపూడియే మాది.

ఓ అబ్బో, ఓ అబ్బో, ఓ అబ్బో అంటూ మాథాకవళం మాయమ్మ, మడిమాన్యాలే లేవమ్మా అంటూ పారితోషికాన్నందుకుంటారు.

వెంకట రాముడు:

ఈ వేషాన్ని కూచిపూడివారు ఒక పద్ధతిలో ప్రదర్శిస్తే వెంకట రాముడు సామెతలతో హాస్యోక్తులతో మూడువందల ఇరవై రోగాలకు మందుల పేర్లు చెప్పి ఆకిరి పిల్లి గట్టుకాడ, అవ్వసరికాడ, ఔషద క్రియలు తెచ్చానని చెపుతూ, హాస్య ధోరణిలో.

పందిపిల్లనిచ్చి పరువు నిలిపి నట్లుగను
కుక్కపిల్ల నిచ్చి కులము నిల్పినట్లుగను

కడుపుబ్బ నవ్విస్తూ కేవలం వినోదం బోధించడమే కాక ఆరోగ్య నియమాలను పాటించ కుండా, ఆరోగ్య చెడగొట్టుకున్న వారిని, హేళనచేస్తూ, సన్మార్గం బోధించటమే మందుల వాని వేషం యొక్క ముఖ్య వుద్దేశం.

సిద్దీ - కంచెనీ వేషాలు

జానపద కళారూపాలలో ఎక్కువ స్థానాన్ని ఆక్రమించినవీ, బహు రూపాలుగా ప్రజలను అలరించినవీ, పగటి వేషాలే, ఆలాంటి వాటిలో నాటి సామాజిక పరిస్థితుల్ని వివరించేదే సిద్దీ - కంపెనీ వేషాలు.