పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/244

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పురుషపాత్రల్లో ముఖ్యంగా రాజు కిరీటాన్ని, శంఖ చక్రగదాదండాల్ని, భుజ కీర్తుల్నీ గండ భేరుండ పతకాలలు, కర్ణ పత్రాలు, కాశికోక, కండువాలు, నల్లకోటు మొదలైన వాటిని ప్రధాన భూషణాలుగా ధరించేవారు.

ఇంకా పురుష పాత్రల్లో తార తమ్యాలను బట్టి తదితర కోట్లు, ఘర్వాలు, చొక్కాలు, అంగరఖాలు ఉపయోగించేవారు.

నరసింహ స్వామి, శక్తి, రావణుడు, హిరణ్యకశిపుడు, హనుమంతుడు మొదలైన భీకర పాత్రలకు కరాళములను, ముఖాలకు ముసుగులను వాడేవారు.

అందమైన ఆభరణాలు:

నిత్య జీవితంలోనే పురుషులకంటే స్త్రీలకు ఆభరణాలు ఎక్కువ. అలాగే ప్రదర్శనాలలో కూడ ఎక్కువగా ధరించేవారు. నిజంగా కూచిపూడి కళాకారులు వారి భాగవతాలలో స్త్రీ పాత్రలకు ఒక ప్రత్యేకమైన ఆభరణాలను ధరింపజేసేవారు. ఆ కాలంలో ఆచరణలో వున్న స్త్రీల అభరణాల నన్నింటినీ పుపయోగించేవారు. కొన్ని లోహాలకు సంబందించినవి, మరి కొన్ని పేడతో తయారు చేసినవి, మరికొన్ని కాగితాలతో మోల్డింగులుగా తయారుచేసినవి ధరించేవారు.

భామ వేషపు నగలు:

భామ వేశ్హానికి ఎన్నో ప్రాచీన ఆ ఆభరణాలను ఉపయ్హోగించేవారు. వారానికి కొన్ని నగలు చొప్పున, ఏడువారాలకు ఏడు రకాలైన వివిధ ఆభరణాలను ధరించే వారు: పెద్ద జడ, చిన్న జడ,__ శిఖ, __రాగిరేకులు, __ మొగిలి రేఖులు, __రాగిడి__ చంద్రవంక__ కమ్మలు, __ జూకాలు __ తాయెత్తులు__ చేర్లు__ పాపిట తురాయి__ పాపిడి పింజరాలు__ కడియాలు__ డండ కడియాలు __పోచీలు __దట్టెడ__ అడ్డబాస__ బిళ్ళలమొలత్రాడు__ కట్టడపు బులాకి __ ముక్కుపుల్ల మొదలగునవి. ఇవిగాక కాసులపేరు__ సూర్యుడు__ముత్యాలు__తాయెత్తులు __కితకి వడ్డాణము __ జడకుప్పెలు __ మొదలైనవి కూడా ధరిస్తారు. వారి జడబిళ్ళలు నవరత్నాలు చెక్కినట్లుండేవి. ఆ బిళ్ళ సూర్యుడు__ చంద్రుడు __నక్షత్రాలు మొదలైన ఖగోళ శాస్త్రానికి సంబంధించిన విశేషాలుండేవి.