పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/231

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాలుగు దశలుగా విభజించుకుని నాట్యంలో వుత్తీర్ణులుగా తయారవుతారు. ఇందువల్ల విద్యాభ్యాసమే కాక వ్యాయామ శిక్షణద్వారా అంగ సౌష్టవం, కుదిరికలూ, ఆరోగ్యం ఎంతో బాగుండి ఎక్కువకాలం జీవించడానికి, అయాసం లేకుండా ఎక్కువకాలం నృత్యం చేయ డానికి వీలవుతుంది.

కూచిపూడి భరతనాట్యం:

భావ, రాగ, తాళ యుక్తంగా నటించే నాట్యాన్నే భరత నాట్య మంటారు. నాట్యం నృత్యమనీ, నృత్తమనీ రెండు భాగాలు. భావాని స్పష్టపరచేది నృత్యం, భాషతో భావాలను వ్వక్తం చేసేది నృత్తం. కూచిపూడి నాట్యాచార్యుడు వీటినన్నిటినీ మేళవించి నృత్యం చేస్తారు. పాటలో వున్న ప్రతి పదం యొక్క భావాన్నీ అభినయం ద్వారా చూపిస్తారు. ఈ విధంగా సంగీతం, సంగీతం ద్వారా పదం, పదం ద్వారా అభినయం. అభినయంద్వారా భావ విశిష్టత వెల్లడిస్తూ నృత్తమూ, నృత్యమూ కూచి పూడి సాంప్రదాయంలో ప్రాముఖ్యం వహించాయి.

ముద్దులొలికే క్షేత్రయ్య మువ్వగోపాల పదాలు:

మువ్వగోపాల పదాలను కూచిపూడి భాగవతులు వారి వీథి భాగవతాల్లో పాడడం, భరత నాట్య సంప్రదాయం ప్రకారం అభినయించడం చేశారు. క్షేత్రయ్య పదాలను ఎక్కువ ప్రచారంలోకి తీసుకొచ్చిన వారు కూచిపూడి భాగవతులే. ప్రాచీన కాలంనుంచీ మన కళారూపాలు ఎలా ఎలా పరిణామం చెందాయో, అలాగే మన గేయ వాఙ్మయం కూడ అభివృద్ది పొందింది. క్షేత్రయ్య నివాస స్థానం కృష్ణా జిల్లా దివి తాలూకా మువ్వ గ్రామం. ఆ గ్రామంలోని గోపాలస్వామి మీదే క్షేత్రయ్య గోపాల పదాలను రచించి దక్షిణదేశ మంతా సంచారం చేశాడు. అనేక యాత్రాస్థలాలకు పోయి కంచి వరదునిపైనా, తిల్ల గోవిందునిపైనా, యదుగిరి స్వామి, శ్రీ వెంకటరమణుడు, ఇనపురిధాముడు, పాలగిరి చెన్నడు, మధురాపురాధీశుడు మొదలైన దేవుళ్ళపైనా క్షేత్రయ్య అక్షయంగా పాటలను రచించాడు. క్షేత్రయ్య తన పదాలను భక్తిభావంతోనే గాక సంగీత సమ్మేళనాలతో, అభినయ ప్రదర్శనానికి కూడా ఎన్నో గీతాలను రచించాడు. దక్షిణ దేశంలో త్యాగరాజు, ఉత్తర దేశంలో జయదేవుని మాదిరి క్షేత్రయ్య కూడ అశేష ప్రాముఖ్యత వహించిన గేయ