పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/177

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


బొమ్మలూ, తోలుబొమ్మలూ

ఆంధ్రదేశంలో ఆబాలగోపాలాన్ని అనందింపజేసి, అన్ని కళారూపాలతో పాటు దీర్ఘ కాలం దివ్యంగా వర్ధిల్లిన కళారూపం తోలుబొమ్మలాట.

సకల కళాసమన్వితం:
TeluguVariJanapadaKalarupalu.djvu

మన లలిత కళలకు ఈ కళ వుపాంగంగా వున్న, లలితకళలు అన్నీ ఈ ప్రదర్శనంలో మూర్తీ భవించి వున్నాయి. కావలసినంత కవిత్వం వుంది. సాహిత్యం వుంది. సంగీతం వుంది. శిల్ప, చిత్ర కళలు తొణికిస లాడుతూ వుంటాయి. కడుపుబ్బ నవ్వించే హాస్యారస ఘట్టాలున్నాయి. లలిత కళ లన్నిటిలోనూ ఈ ప్రదర్శనం ఎంతో కన్నుల పండువుగా వుంటుంది.