పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/152

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

120

జానపదకళారూపాలు


అని, ఈ వివరణ బట్టి చూచినా జనులు వేషముల్ గట్టి పాడగా బుధులు చూచి ఆనందించేవారని అర్థమౌతుంది.

కూర్మనాథ కవి:

1624 సంవత్సర ప్రాంతంలో కోకుల పాటి కూర్మనాథ కవి మృత్యుంజయ విలాసమనే యక్షగానాన్ని వ్రాశాడు. అది అతి ప్రౌఢంగా వుందని దీక్షితులుగారన్నారు.

వైకుంఠ వామన వారిజ నాభ
నీ కంకితముగ నా నేర్చిన రీతి
మృత్యుంజయ విలాస మృదుతర కావ్య
మత్యంత భక్తితో యక్షగానంబు
రచియించి నీకు నర్పణ సేయ దలచి

అని ఒక చోట తన గ్రంథాన్ని యక్షగానమన్నాడనీ మరి ఒక చోట నాటకమనీ అన్నాడు.


అత్యంత భక్తితో నంకితంబైన
మృత్యుంజయ అవిలాస మృదుల నాటకము
హరి కంకితంబౌట హరి కథ యౌట.

అని అనడాన్ని బట్టి యక్షగానమన్నా, నాటకమన్న ఒకటి గానే భావించారనడానికి పై ఉదాహరణను తీసుకోవచ్చు.

భామ వేషంలో, యక్షగాన పోకడ:

తరతరాలుగా ప్రదర్శిస్తున్న కూచిపూడి వారి భామ వేషం, యక్షగానమనే నాఊహ అంటున్నారు చింతావారు.

భామ వేషంలో కథ పారిజాత పుష్పానికి సంబంధించిన ప్రసంగానికి సంబంధించింది. తనకు నారదుడిచ్చిన పువ్వును శ్రీకృష్ణుడు రుక్మిణికి ఇవ్వగా సత్యభామ విని కోపించటం, విరహం చెండటం, కృష్ణునికి సందేశం పంపటం; కృష్ణుని కలుసుకోవటం, అలకపాను పెక్కటం, తరువాత విరహ తీరటం.