పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/145

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్షయంగావెలుగొందిన యక్షగానం

113


దాయాలను గూర్చి , శ్రీశైలం శివరాత్రి మహోత్సవాలలో జరిగే నాటక రూపాలను గూర్చి, పండితారాధ్య చరిత్ర పర్వత ప్రకరణంలో "నాదట గంధర్వ యక్ష విద్యాధురాదులై పాడేడు నాడేడువా"రని వివరించాడు. యక్షగానం ఎంతో ప్రాచీన కళా రూపమైనప్పటికీ, పండితారాధ్య చరిత్రలో వివిధ కళారూపాలను చర్చించినంత విపులంగా యక్షగానాన్ని గూర్చి వివరించక పోవడాన్ని బట్టి 1280 కి పూర్వ యక్షగాన కళారూపం అంతగా ప్రచారంలో లేదని తెలుస్తూంది.

చెన్నశౌరి మొదటి యక్షగానం:

చరిత్రను బట్టి చూస్తే 15వ శతాబ్దం ప్రథమ పాదంనుంచే మనకు యక్షగానాల ప్రసక్తి కనబడుతూ వుంది. పదిహేనవ శతాబ్దం నాటి ప్రొలుగంటి చెన్న సౌరి "సౌభరి చరిత్రాన్నీ" ఉదహరించడాన్ని బట్టి తెలుగులో ప్రథమంగా వెలువడిన యక్షగానం అదేనని చెప్పవచ్చు.

ఎందరో చెప్పిన, యక్షగానా వివరణ:

16 వ శతాబ్దంలో రచించబడిన చిత్ర భారతం యక్షగానంలో యక్ష వనితల పాట, యక్షకామినుల నాట్యం పేర్కొనబడ్డాయి. 16 వ శతాబ్దంలో యక్షగానాల ప్రభావం ఎక్కువగా వున్నట్లు తెలుస్తూ వుంది.