పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/141

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
109
అక్షయంగా వెలుగొందిన యక్షగానం


అలాగే, పిల్లలమర్రి పిన వీరభద్రుడూ, నందిమల్లయ్య, ఘంటసింగయ్య, మంచన మొదలైన కవులు "శాకుంతలం" ప్రబోధ చంద్రోదయం విద్దసాల భంజికలను ప్రబంధాలుగానే వ్రాశారు కాని, నాటకాలు మాత్రం వ్రాయలేదు.

తెలుగు కవుల, సంస్కృత నాటకాలు:

ప్రసిద్ధ సంస్కృత నాటక కర్తలైన భవభూతి, "మురారీ" భట్టనారాయణ ఆంధ్రులే, సంస్కృతంలో ఉన్మత్తరాఘవం, మదనవిలాస బాణం "మహాభారతం" నరకాసురవిజయవ్యాయోగం, రత్నపాంచాలిక; రచించిన భాస్కరుడూ. "పశుపతీ" నాగనాథుడూ గంగాధర కవి "ధర్మసూరి" సింగ భూపాలుడు మొదలైన కవులందరూ ఆంధ్రులే.

వేరే కాక ఆంధ్రకవులైన "వెంకటాధ్వరి" "నృసింహకవి" భట్ట భాణుడు మొదలైన ఆంధ్రకవులు. సంస్కృతంలోనే నాటకాలు వ్రాశారు. ఆ విధంగా సంస్కృతంలో నాటకాలు వ్రాసిన వారిలో దేశం మొత్తంమీద అగ్ర తాంబూలం అందుకున్న వారు ఆంధ్ర సంస్కృత నాటక కర్తలే.

అలాగే కాటయవేమూడూ, సుప్రసిద్ధ తెలుగు నాటక రచయిత కోలాచలం శ్రీనివాస రావు మొదలైన వారు ఆంధ్రులైనా, సంస్కృత నాటకాలకు వ్యాఖ్యానాలు మాత్రమే రచించారు.

నన్నయభట్టూ, నాటకాల ప్రస్వావనా?:

పై వివరాలనుబట్టి తెలుగులో నాటకాలను ఎవరూ రచించక పోయినా, నన్నయభట్టు అవతారికను పరిశీలించి నట్లైతే__

విమల మతిం బురాణములు వింతి ననేకము లర్థధర్మ
శాస్త్రముల తెఱంగెగఱంగితి నుదాత్తరసాన్విత కావ్య నాటక
క్రమముల పెక్కు సూచితి, జగత్పరి పూజ్యములైన యీశ్వరా
గమముల యందు నిల్పితి, బ్రకాశముగా హృదయంబు భక్తితోన్

TeluguVariJanapadaKalarupalu.djvu

అని రాజ రాజ నారేద్రుని చేత చెప్పించడం వల్లనూ, అలాగే పాలకురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రలో__