పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/140

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
108
జానపదకారూపాలు


ప్రాచీనంలో ప్రాచీనం: యక్షగానం:

మన ప్రాచీన కళారూపాల్లో అతి ప్రాచీనమైంది యక్షగానం. ఆంధ్ర, తమిళ, కర్ణాటక రాష్ట్రాలలో అతి విస్తారంగా వ్యాప్తిలోకి వచ్చింది. ఈ నాడు మన చూస్తున్న వీథి భాగవతాల మాత్రుకలు ఈ యక్షగానాలే.

యక్షగానాల తరువాత ప్రచారంలోకి వచ్చింది వీథి భాగవతాలు. యక్షగానం అంటే యక్షులచే పాడబడే సంగీత విశేషం అనీ, యక్షగానాలు ఎక్కువగానూ మక్కువగానూ జక్కు జాతివారు ప్రదర్శిస్తారు గనుక యక్ష శబ్దం జక్కు శబ్దంగా మారిందనీ, ఇది

TeluguVariJanapadaKalarupalu.djvu

యక్షులతో పాడబడే సంగీత విశేషమనీ , ఇంకెన్నో రీతుల వ్యాఖ్యానించారు. వ్యాఖ్యానించిన వారందరూ వారి వారి రచనల్లో నాటకాలను ప్రస్తావించారు. వారు ఉదహరించిన నాటకాలు, యక్షాగానాలా? లేక యక్షగానాలనే నాటకాలుగా ఉదహరించారా? తెలుసుకోవడం ఎంతైనా అవసరం.

మన అలంకారికులు:

నాటకాంతం హి సాహిత్యం, కావ్యేషు నాటకం రమ్యం, అని మన సంస్కృత అలంకారికులు సాహిత్య ప్రక్రియలో నాటకానికి అత్యంత ప్రాముఖ్యత ఇచ్చినా మన పూర్వాంధ్ర కవులెవరూ నాటక రచనకు పూనుకోలేదనీ, సంస్కృత లక్షణ గ్రంథాలను అనువాదం చేసిన పూర్వాంధ్ర లాక్షిణికులు, నాటకాన్ని వదిలి వేస్తూ వచ్చారనీ శ్రీనివాస చక్రవర్తి గారు (నాట్య కళ జానపద సంచికలో వివరించారు)

అయితే తిక్కనగారి విరాటపర్వం చదివినా పింగళ సూరనగారి ప్రభావతీ ప్రద్యుమ్నం చదివినా వారిద్దరికీ, నాటక కళలో ప్రవేశమున్నట్లు మనకు అర్థం అవుతుంది కానీ వీరిరువురూ తెలుగులో నాటకం మాత్రం వ్రాయలేదు.