పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/121

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డదివిద్యావినోదాల్లో
ఘనత వహించిన గోల్కొండ నవాబులు

క్రీసుశకం 1347 వ సంవత్సరమున ప్రారంబమైన బహమనీరాజ్యం 1512 లో అయిదు రాజ్యాలుగా విడిపోయింది. వీటిలో ఒకటైన గోల్కొండ నవాబులు తెలంగాణా ప్రాంతాన్ని పరిపాలించారు. ఈ నవాబులు 1512 నుండి 1687 వరకు 158 సంవత్సరాలకు పైగా తెలంగాణాను, కోస్తా జిల్లాలలో కొంత భాగాన్ని పరిపాలించారు.

TeluguVariJanapadaKalarupalu.djvu

గోల్కొండ నవాబులు మొత్తం అయిదుగురు. వీరి పేర్లు కులీ_ జంషీదు_ ఇబ్రహిం_ మహమద్ అబ్దుల్లా అబుల్ హసన్, ఈ నవాబులకు దక్షిణాత్యులతో కలిగిన సహచర్యంవల్ల ఈ అభిమానం ఏర్పడింది.

గోలకొండను పరిపాలించిన నవాబు అబ్దుల్ హసన్ తానీషా కూచిపూడి కళాకారులకు `1687' లో కూచిపూడి గ్రామాన్ని అగ్రహారంగా దానమిచ్చినట్లు మాచువల్లి కైఫీయత్ లో వుదహరించబడి వుంది.

విద్యాప్రియుడైన ఇబ్రహీం కుతుబ్ షా:

గోలకొండ పాదుషాలలో ఇబ్రహీం కుతుబ్‌షా విద్యాప్రియుడు. ఈతని ఆస్థాన కవులు పండితుల్లో హిందువులూ, మహమ్మదీయులు కూడ వుండేవారు. విద్యాగోష్ఠి ఎల్లప్పుడూ జరుగుతూ వుండేది. పాదుషావారు పండితుల్ని తగురీతిని సన్మానించేవారు. తపతీసంవరణోపాఖ్యాన కావ్యం రచించి

TeluguVariJanapadaKalarupalu.djvu

పాదుషాకు అంకితమిచ్చిన అద్దంకి గంగాధరకవిని పాదుషా సత్కరించాడు. పాదుషాలు లలితకళల్నీ, వాఙ్మయాన్ని అభివృద్ధి చేయడానికి ఇతోధికంగా ప్రయత్నించారు.