పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అంతేకాదు. అనాడు దక్షిణదేశంలో మైసూరు పుదుక్కోట మొదలుగాగల సంస్థానాలలో కూడ ఈ భాగవతాల ప్రభావం పడింది. ప్రతి గ్రామంలోనూ యక్షగానాలు విరివిగా ప్రదర్శనాలను చూచి ఆనందించడమే కాక వారు కూడ నేర్చుకోవడం జరిగింది. ఆనాటి నుంచీ బ్రాహ్మణ పండితులు ఈ భాగవత మేళాలను సంప్రదాయ సిద్ధంగా తయారుచేయాలనుకుని వుత్సాహంతో నడుంకట్టి శాస్త్రయుక్తంగా భాగవతాలను నేర్చుకున్నారు. ఆలాంటి శాస్త్రయుక్త భాగవత మేళాలను కలిగిందే మేలటూరు.

క్షేత్రయ్య పదాలకు కొమ్ము మోసింది కూచి పూడి వారే:

తంజావూరును పాలించిన విజయరాఘవనాయకుని కాలంలోని క్షేత్రయ్య ఆస్థాన గౌరవాలన్నిటినీ అక్షయంగా పొందాడు. పదాభినయానికి, సాత్వికాభినయనానికి క్షేత్రయ్య పదాలకు విశిష్టంగా ప్రాధాన్యం యిచ్చేవారు. అందువల్ల ప్రదర్శనాలు ఎంతగానో విజయవంతమయ్యేవి. క్షేత్రయ్య పదాలు తమిళ దేశంలో కూడ విస్తారంగా ప్రచారంలో వచ్చాయి. ఈ నాటికి తమిళదేశంలో వాటిని పాడుతున్నారు. ఆ పదాలలో మధ్య మధ్య తెలుగు నుడికారాలు అచ్చుగుద్దినట్లు అగుపిస్తూ వున్నాయి. ఈ విధమైన క్షేత్రయ్య పదాలను బహుళ ప్రచారంలోకి తీసుకువచ్చిన వారు కూచిపూడి భాగవతులే.

తంజావూరు ఆంధరాజుల సమక్షాన ప్రదర్శనాలిచ్చిన నాటినుండీ కృష్ణా జిల్లా కూచిపూడికి, అచ్యుతాపురానికి, వూత్తుక్కాడుకూ బంధమూ, బంధుత్వాలు పెరిగాయి. అక్కడున్న తమిళులపై తెలుగు భాష ప్రభావం పడి వారు కూడ తెలుగు వారుగా మారి, వారి పిల్లల్నీ వీరికివ్వడం, వీరి పిల్లల్ని వారు చేసుకోవడం ద్వారా బంధుత్వాలు పెరిగి పోయి, ఆంధ్రదేశంలో కూచిపూడి కళాక్షేత్రమెలాగో, అలాగే దక్షిణ దేశంలో వూత్తుక్కాడు, మేలటూరు గ్రామాలు కళాక్షేత్రాలుగా వెలుగొందుతున్నాయి.

ఆంధ్ర, తమిళ సమరస సాంప్రదాయం:

కూచిపూడి కళాకారులు ప్రదర్శించే సంగీత నాటకాలకూ, దక్షిణాది సంగీత నాటకాలకూ చాల దగ్గర సాంప్రదాయాలున్నాయి. వారూ వీరు భరత నాట్య