పుట:TeluguSasanalu.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గూడూరు శాసనము చేతనే 5వ పద్యములో ప్రాసస్థానమున 'ల' కు బదులు 'కారకశాలుడై' యని 'ర' ను వాడినాడు. 'కాలకశాలు' డమటయే యుక్తము అనగా 'కాలయముడు' లేక 'కాలాన్తకుడు' అని అర్ధము. ఈ సూరడే కన్నడ భాగములో జెప్పబడిన మల్లన తాతయగు విరియాలసూరడు. ఇది యైదవ పద్యము.కొమ్మొజన బరహా అని కన్నడములో కొమ్మొజు వ్రాసెవని చెప్పబడెను. దీనివలన పై కన్నడ శాసనమును వ్రాసినది కూడ నితడేనని యర్ధము గనుక అది,ఇది అంత ఒకరే వ్రాసిరనవచ్చును.'అడపగట్టు దేవరకుజను' అని తుది వాక్యము.అంటే తాంబూలము దేవరకు ఇచ్చితినని కొమ్మోజు చెప్పుకొనెను.తన కిచ్చిన కూలి దేవుని కని యర్ధము.

           ఈ విధముగ గూడూరు శానములోని చరిత్రాంశకమును కొంతవరకిప్పుడు చెప్పగలుగుచున్నము.ఇది కాకతీయుల మొదటి చరిత్రకు,కొరవి రాజులైన ముదుగొండ చాళుక్యులు చరిత్రకు చాల ముఖ్యమైనది'.కాని పూర్తిగ అర్ధముకాదు.కన్నడ లేఖకు డగుటచే తప్పులుగూడ కొన్ని గలవు.ఇందలి విషయము క్రీ.1000 ప్రాంతమునాటిది.శాసనము క్రీ.1124 నాటిది. 

శాసనమూలము: 1.చ. అనుపమ దుజ్జకా యాయ