పుట:TeluguSasanalu.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

15. బణపతి దీర్ఘాసి శాసనము. (శకము. 997).

కలింగపట్నమునకు నాలుగుమైళ్లు ఉత్తరముగ దిర్ఘాసి యను గ్రామము కలదు. అచట దుర్గమెట్ట యను కొండపై నొక శిథిలాలయము వద్ద నీశాసనము కలదు. దీనియందు కొంత సంస్కృతభాగము; మిగిలినది తెలుగు పద్యభాగము.

గంగాన్వయమునకు చెందిన రాజరాజు కళింగదేశమును క్రీస్తు 1068 నుండి 1076-77 వరకు పాలించెను. అతని మాణ్డలికులలో నొకడు బణపతి యనువాడు ఈ శాసనమును వ్రాయించెను. దీర్ఘాసి నగరమున దుర్గాలయము నకు ముందు తానొక మణ్డపమును నిర్మించి, శతాబ్దము 997 న ఆ దేవికి అఖండ దీపమునకై దానమొసగినట్లు ఈ శాసనమందు కలదు. అతని భార్యయు మరియొక దీపమునకు దానము చేసెను. ఈ బణపతి తన యేలిక పంపున చోడరాజును (మొదటి కులోత్తుంగుడు) వడ్డదేశమును, కిమిడి దేశమును (పర్లాకిమిడికి) గొడ్రిసింగ (తెలియదు) వేంగి దేశమును జయించినట్లు చెప్పబడెను. బణపతికి చలమర్తిగండ, బణ్డన విజయ, గణ్డగోపాల అను బిరుదులు చెప్పబడెను.