పుట:TeluguSasanalu.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

'ఐ' అనియే వ్రాయుచోట 'అయి' వ్రాయకుండ ఏత్వము క్రిందైత్వము వ్రాసెను. ఖట్గసహాయుణ్డై, రాముణ్డై, [లో] కాన్తరితుణ్డై, భాసురుణ్డై, అరుహుణ్డై, 'సమానుణ్డవైన చెలివి' అనుచోట మాత్రము 'ఐన' అని కలదు. (కడపజిల్లా అనిమెలలోని క్రీ. 976 నాటి వైదుంబ శాసనములో వర్షంబు 'ఐన' అని విడిగా 'ఐ' కారము కనిపించు చున్నది). ఈ కొరవి శాసనములో విశేష మేమన 'అయిన' అను రూపములేదు. కానీ అయ్న అనేదే పైపదములలో కనిపించు చున్నది. అనగా ఉచ్ఛారణ సౌకర్యము కొఱకు యి లోని ఇ లోపించినదని అర్థము. ఈ లోపము సంస్కృతంలోను కనిపించును. సంస్కృతములో దీనిని ఉపధాలోపమని చెప్పుదురు.