పుట:TeluguSasanalu.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

52

తెలుగు శాసనాలు


కథ యెంతవఱకో తెలియక కొంత సందేహము. శాసనమ సంపూర్తి యగుటచే కొంత కష్టము.భాష విషయములో మొద టి రెండు భాగములలోను కష్టము కనిపించదు. మూడవ భాగమున దండనములు విధించు సందర్భములోనే కొన్ని పదము లర్థము కావు.

ఈ ముదుకొండ పల్కుల శాసనములు వేరే రెండు తామ్ర పట్టికలు గలవు.కాని వాటి ల్లో కేవలము వంశవృక్షములు మాత్ర మొసఁగబడిని.రాజకీయాంశము లెవ్వియు తెలుప బడలేదు. ఇదియే ఆ రాజులకు సంబంధించిన క్లిష్టమగు రాజకీయములను తెలుపుచున్నది.శాసనమును రచించుటలో జూపిన నేర్పును చెప్పదలచిన విషయములను సుబోధ మగు నట్లు వ్రాయజాలక పోయెననిపించును.ఆనాడు వారి దృష్టిలో రాజకీయ విషయములన్ని పరిచితములై యుండినవే గనుక వారికి ఈ రచన చక్క గానే అర్థమగుచుండెడిదని భావించవలెను. మనమిప్పుడు ఆ రాజకీయములలోని విశేషాంశములను వేఱే ఆధారముల ద్వారా కనుగొనవలసి యుండుటచే కష్టముగా నున్నది.

శాసన మూలము

పెద్దరాయి-మొదటివైపు

  1. శ్రీ విక్రమాదిత్య నృపా
  2. గ్రతనయుణ్డయ్న చాలుక్య
  3. భీమునకు శౌచకన్ధప్ప೯
  4. నకు వే[ం]గీశ్వరునకు రన
  5. మద్ధ೯(ద్ధా೯)న్వయ కులతిలకు
  6. ణ్డయ్న కుసుమాయుధుణ్డు గ
  7. న్నర బల్లహుని కస్తప్రాప్త
  8. [0]బయ్న రనమద్ధ೯(ద్ధ೯)కణ్ఠియం దన
  9. భుజవీయ్య[೯]బలపరాక్ర
  10. మంబున న్దెచ్చి కణ్ఠియం కట్టి
  11. పట్టం బెత్తి ఖఱ్గ సహాయు
  12. ణ్డై నేల యెల్లం గావంబు(బూ)ని