పుట:TeluguSasanalu.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
పరిచయము


సహస్రాబ్దాలుగా ప్రవర్ధమానమగుచున్న తెలుగుసంస్కృతిని తెలుగుదేశపు నలుదెరుగుల పరిచతము చేయు సంకల్పముతో 1975 వ సంవత్సరమును తెలుగు సాంస్కృతిక సంవత్సరముగ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రకటించినది.అందుకు అనుగుణమైన కార్య క్రమాలను నిర్వహింపజేయుటయేగాక,ప్రపంచములోని వివిధదేశాలలో నివసించుచున్న తెలుగువారి సాంస్కృతిక ప్రతినిధులందరును ఒకచోట సమావేశమగు వసతిని కల్పించు టకై 1975, ఏప్రిల్ 12(తెలుగు ఉగాది)మొదలుగ ప్రపంచ తెలుగుమహాసభ హైదరా బాదున జరుగునటుల ప్రభుత్వము నిర్ణయించినది.అందుకు ఒక ఆహ్వాన సంఘము ఏర్పాటయినది.ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వముఖ్యమంత్రి మాన్యశ్రీ జలగం వెంగళరావుగారు ఆ సంఘమునకు అధ్యక్షులు.విద్యాశాఖామంత్రి మాన్యశ్రీ మండలి వెంకట కృష్ణారావు గారు దాని కార్యనిర్వాహకాధ్యక్షులు.ఆర్థికమంత్రి మాన్యశ్రీ పిడతల రంగారెడ్డిగారు ఆర్థిక, సంస్థాకార్యక్రమాల సమన్వయసంఘాల అధ్యక్షులు.

ఆ సంఘము, ప్రపంచతెలుగు మహాసభల సందర్భమున వచ్చు వారికి తెలుగుజాతి సాంస్కృతిక వైభవమును తెలియ జేయుటకు అనువుగ అంధ్రభాషా,సాహిత్య,కళా, చరిత్రాది కములులను గురించి ఉత్తమములు,ప్రామాణికములునగు కొన్ని లఘు గ్రంథములను ప్రకటించవలెనని సంకల్పించి,ఆ కార్యనిర్వహణకై 44 మంది సభ్యులుకల ఒక విద్వత్ సంఘ మును, శ్రీ నూకల సరోత్తమరెడ్డి గారి అధ్యక్షతన నియమించి నది.ఆ విద్వత్ సంఘము ఆ లఘు గ్రంథముల వస్తువుల నిర్దేశించి వాని రచనకై ఆయా రంగము లందు పేరుగనిన ప్రముఖులనురచ యితలుగ యెన్నుకొనినది.ఈ విధముగ సిద్ధమైన గ్రంథము లలో భాషా,సాహిత్య,చారిత్రక విషయము లకు సంబంధించి వ్నఆనిని ప్రకటించు బాధ్యతను ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడ మీ వహింప