పుట:TeluguSasanalu.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

50

తెలుగు శాసనాలు

లేరు.తనతండ్రి నిహతుడైనను గొణగయ్య రాష్ట్రకూట చక్రవర్తి యగు కృష్ణరాజును తరుమకొట్టి తన రాజ్య మును వేంగిరాజ్యమును కాపాడుట కొద్దిపాటి విష యము కాదు.చాళుక్య భీమునకు చేసిన ఈ మేలు నకు ప్రతిఫలముగ వేంగిరాజ్యములో గొణగయ్య గౌర వ ప్రతిపత్తులు ఇనుమడించెను.కొరవి శాసనము లో మొదటి భాగమునగల చరిత్ర యిది.

కొంతకాలము గడిచినది.సుమారు ముప్పది సంవ త్సరముల తర్వాత మొదటి భీముడు గతించెను.అతని పుత్రుడు కొల్లభిగణ్డ విజయాదిత్యుడు కొద్ది కాలమేలె ను.ఇతని పుత్రుడు మొదటి అమ్మరాజు వేంగికి రాజయ్యె ను. అతడుకూడ ఆఱేడు సంవత్సర ములు రాజ్యము చేసి గతించిన పిమ్మట దాయాదులలో కల హమువచ్చి వేంగిరాజ్యము ను యుద్ధమల్లుని వంశ్యులగు తాడవ.అతని కొడుకు రెండవ యుద్ధమల్లు డు చేజిక్కించుకొని యేడు సంవత్సరములు రాజ్యము చేసిరి. క్రీ.934 లో మరల అమ్మరాజు వంశమునకు చెందినవారు తిరుగబడిరి. అమ్మ రాజు సవతి తమ్ముడగు రెండవ భీముడు యుద్ధమల్లుని కడతేర్చి రాజ్యము చే జిక్కించికొనెను.ఇట్టి అనిశ్చిత పరిస్థితిలో ముదుగొండ రాజగు గొణగయ్య కెవరిని చేబట్టి వేంగితో తనకుగల సంబంధమును నిలబెట్టుకోవలెనో తోచలేదు.రెండవ యుద్ధమల్లు నికి రాష్ట్రకూట చక్రవర్తి యగు నాలుగవ గోవిందుని అండ దండలు గట్టిగా నున్నవి.కాని యుద్ధమల్లుడు రాజ్యార్హుడు కాదని గొణగయ్య భావించెను. మొదటి అమ్మరాజు కొడుకు బేత విజయాది త్యుడు పిఠాపురము పారిపోయె ను.అతని దృష్టిలో దేశము విడచి పారిపోయిన అమ్మరాజు పుత్రుడగు ఈవిజయా దిత్యుడే న్యాయమైన రాజు.కానిబలహీనుడగుటచే రాజ్యమును దక్కించుకొనలేక పోయెను.యుద్ధమల్లుని కడతేర్చి రాజ్యమును సంపాదించిన రెండవ భీమునితో ముందుగా తన వ్యతిరేకతను చూసి విరోధము తెచ్చుకొనెను.యుద్ధమల్లునికి సహాయముకొఱకు వచ్చిన రాష్ట్రకూట గోవిందుడు ముందుగా ముదుకొండ రాష్ట్ర ముపై బడెను.వేంగిలో తాను నమ్మిన బేత విజయాదిత్యుడే పారిపోగా తనకు స్థానమేమాత్రము లేదని తలచి గోవిందుని ధాటికి ఆగలేక గొణగయ్య పొరుగున ఉన్న వేములవాడ చాళుక్య రాజైన రెందవ అరికేసి యొద్ద శరణు జొచ్చెను. ఈలోగాఅతని సోదరుడగు నిరవద్యుడు వేంగిలో రాజుగ నిలబడిన రెండవ భీముని ప్రాపుచేరి అతని బలముతో గోవిందు నెదిర్చి తరిమి వైచి ముదుకొండను