పుట:TeluguSasanalu.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10. కొరవి శాసనము.

(సుమారు క్రీ.935)


పదవ శతాబ్దము లోగాగల తెలుగు శాసనాలలో ముఖ్యముగ చెప్పదగినది కొరవి శాసనము.ఇది క్రీస్తు 935 నాటిదని చరిత్రకారుల అభిప్రాయము.అప్పటి తెలుగు శాసనము లన్నింటిలోనిది భాషయందు,చారిత్రక విశేషములందు చాల ముఖ్యమైనది. ఇది వరంగల్లు జిల్లా మానుకోట(యిప్పటి మహబూబాబాదు)తాలూకాలో కొరవి గ్రామ మున వీరభద్రాలయములో నున్నది.శాసన స్తంభము తుదియందు విరిగి పోవుటచే నలువైపుల కొన్నిపంక్తులు నష్టమైనవి.ఇటీవల అదే గ్రామమున చెరువులో నొక శాస న ఖండము లభించెను.అదియు నిదేవిధముగనుండ శిలాస్తంభము పై నిదే విధమ గు అక్షరములలో దీని విషయముతో కలియు విషయమునే కలిగి శాసనము యొక్క అడుగు భాగము మాత్రము కలదిగా నుండెను.ముందు చెప్పిన మొదటి భాగమున నష్టమైన భాగమిదియేనని నిశ్చయమ్య్గ చెప్పలేనంత అగోచరముగ విష యము కను పించుచున్నది. మొత్తమున రెండు భాగములను కలిపి చదువు కొన్నను లోగడ గల సందేహము లట్లే యుండును.దీని నిప్పటివరకు పలువురు విద్వాంసులు పరిశీలించి యుండిరి 1. అయినను భాషయందైతేనేమి, చరిత్రయందైతేనేమి యిందలి విషయములు సందేహరహితము కాలేదు.


దీనివలననేగాని వేరువిధముగ తెలియని చరిత్రాంశము కొంత యిందుకలదు. శకాబ్దము లు చెప్పబడకున్నను ఆధారాంతములచే నిది క్రీస్తు 935 నాటిదని తెలియుచున్నది. పూర్వము వేంగీనాటికి పశ్చిమ సరిహద్ధైన ప్రస్తుత ఖమ్మము మెట్టు జిల్లాకు చేరిన విషయమును ముదుకొండ చాళుక్యులనబడు రాజులు దరిదాపు నాలుగు వందల సంవత్సరములు యేలుచువచ్చిరి.(సుమారు క్రీస్తు800 నుండి 1200వరకు).వీరధిక కాలము వేంగిచాళుక్యులకు సామంతులై యుండిరి. చాళుక్య గుణగవిజయాదిత్యుని తరువాత నతని సోదరుడగు విక్రమాదిత్యుని పెద్ద కొడుకగు మొదటి భీముడు క్రీస్తు 892 లో


1.ఎ.పి.ఆంధ్రికా 1.పుట 118-145