పుట:TeluguSasanalu.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొండపఱ్తి శాసనము

47

అనేది పంగునకు విశేషణమో లేక వేరే పన్నును తెలుపు పద మో తెలియదు.మొత్తముమీద రెంటి అర్థము సరిగా తెలియదు .పన్నులని మటుకు తెలుసు.


ఇద్దరు బొత్తున నారభ చేయువారు-కొణ్డప-వందామి గొరవ.ఈ యిఱువుర పొత్తున


అరభ=సేద్యారంభము చేయువారు. అర్మకొండనుండి యారభ చేయువారు - ఇది బహుళ గొరవల పక్షమున పంపబడు సేద్యకాండ్రను తెలుపును.ఈ గొరవలు అర్మకొండ(అన్మకొండ)లోని జైన గురువులు, వారు తమ సేద్యగానిని పంపుదురు.అనుమకొండకు పూర్వము అర్మకొండ యని యితర శాసనములందుకలదు.


స్రావకులభీమయ - ఆసేద్యకాని పేరు.ఆయన స్రావకుడు.సామాన్య జైన మతాను యాయి.


ఈసేద్యకానిని పంపు విషయములో క్ఱొంపాల దివాకరయ,స్రన్నుమేడియ అను నిద్దరు సాక్షులు.


నాగకమరియ-నాగయ్య అనే కమ్మరి యీ శాసనమును తొలిచెను.ఇచట 'నాగయ' లోని 'య' 'కమరి' పదమున చేరుట గమనించదగిన గ్రామ్య ప్రయోగము.


మంగళమహాశ్రీ- పూర్వకాలమునందేది వ్రాసినను 'మంగళాదీని,మంగళమధ్యాని, మంగళాంతాని' అని సంప్రదాయమును పాటించెడువారు.మధ్య అదిలేకున్నను ఆద్యంతములలో మాత్రము శాసనములందీ యాచారము కనుపించును. ఆదిలో 'స్వస్తిశ్రీ' యనియు అంతమున 'మంగళమహాశ్రీ' అనియు ఉండును.


ఇప్పటి కౌలునామా వంటిదీ శాసనము.స్టాంపులు,రిజిస్ట్రేషన్లు లేకుండ చక్కగ తాంబూలాలు పుచ్చుకొని నిర్ణయము చేసుకొన్నారు.దాన్నొక గుండుమీద చెక్కించారు.