పుట:TeluguSasanalu.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

46

తెలుగు శాసనాలు

వడ్డి(ఒడ్డు→ఇడ్డి)=చెల్లించి

ఆరంభచేయువారు=సేద్యము ఆరంభించవలయును.

కూన్తుకూన్తు=స్త్రీ వాచకపదములతో తరతరముల అనునర్థమున బిడ్డబిడ్డ తరమువంటి ప్రయోగము కాని బిడ్డ ఇభయలింగ వాచకము(బిడ్డడు,ఆడుబిడ్డ)కూన్తు పదము పుం వాచకము కానరాదు.

ఇట్టుదక్కని=ఈ విధముగ దక్కు(=చెల్లును) అని

గల్పనుండు=స్థలనామము అచటనుండి ఆ శాసనములో 'నుండి 'అను ప్రత్యయము రెండుచోట్ల వాడబడెను.

వన్దామి గొరవలు=వన్దామి యను పేరుగల గురువులు (మతథానమునకు చెందిన స్థానపతులు)

తంబులంబు దిన్నవా(రు)=తంబులము తిన్నవారు.

దామమోయు,కుమరమయ్యయు,గణపతి యాజు-దీని సాక్షు లని చెప్పబడెను.

ఈ నేలయరి= ఈ భూమికి పన్ను -నాలుగు ద్రమ్మలు

ఆయంబు పుట్టెణ్దగొలుగు=ధాన్యరూపముగ చెల్లించవలసినది. పుట్టెడు కొలత.

ఈ రెండు విధముల రాబడి ధనంజెయుడను పేరుగల ఫల ధారుడు(సుంకాధికారివంటి ఉద్యోగి)తీసికొనగలరు.ఈ పదము తహసీల్దారు,సుబేదారు,జమీందారు వంటి ఉర్దూ పదము కాదు. ఈ సంస్కృతపదము వేఱుచోగానరాదు. క్రయవిక్రయ ము లందు వస్తువులవెలను నిర్ధరించుటయందు ధారణ పద ప్రయోగము కానవచ్చుచున్నది. 'వణిజులు తమయంత వలసిన ధారణ సేయజూచుట ప్రజఁ జెఱచి కొనుట మడికి సింగన సకలనీతి నమ్మకము.ప్ర.218.


అకిడి వంగులేదు:అకిడి వంగు లేదు.ఈ రెండు విధములగు వెఱొండు పన్నులు లేవు.ఈ పన్నులెట్టివియో తెలియవు. వంగు సుంకము వేరే శాసనాలలో కూడవచ్చును.అకిడి