పుట:TeluguSasanalu.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొండపఱ్తి శాసనము

45

చేయుటకై యిచ్చి సమభాగం పాలు పంచుకొనే యేర్పాటు చేసుకొనిరి.పూర్వమిట్టి విధానము నిర్ణయము చేసుకొనునపుడు కూడ అందుకు సంబంధించిన వారు తాం బూల గ్రహణము చేసి తామా నిర్ణయమునకు కట్టుబడి యుందుమని అంగీకరించు ట ఆచారమని మనం దీని వలన గ్రహించెదము.అట్టి ఆచారము వివాహ సందర్భ ము లోనే మనకు ప్రస్తుతము అలవాటుగానున్నది.వధూవరులు నిర్ణయమై వారికి వివాహనుచేయుదమని వారి పెద్దలు నిర్ణయము చేసుకొనునపుడిట్టి సంప్రదాయము కలదు.అట్లు తాంబూలము తినిన పిదప ఆనిర్ణయము మారదని భావము. వివాహ మునకు సంబంధించిన యితర నిర్ణయములు చేయునపుడుకూడ తాంబూలములు స్వీకరించుట కలదు.బజంత్రీలు ,పలకీలు మోయువారు,వంటవారు మున్నగువారిచేత కూడ తప్పక రావలెనను నిర్ణయముతో నిట్టి తాంబూల స్వీకారము చేయబడును.

వేరే కట్టుబాట్ల విషయంలో మనకంతగా ఈ యాచారము కనిపించదు.కాని ఆ కాల ములోనిది ప్రతి ముఖ్యమగు కట్టుబాటుకి ఇరువురు-లేక పలువుర మధ్య పరస్పర ఇప్పందముమీద చేసుకొనబడు నిర్ణయానికి తాంబూల స్వీకరణము అతి ముఖ్యమగు సాంఘికాచారముగ నుండెడిదని మనకు శాసనము వలన తెలియుచున్నది. అట్లు చేసుకొన్ననిర్ణయము అయా పక్షముల వారెవ్వరు తప్పకూడదని కట్టడి,దానికి సాక్షు లుకూడ తాంబూలము స్వీకరించెదరు.ఇది దానము కాదు.కేవల మొక కట్టడి మాత్రమే.


పొలమెయరట్టోడి అనే స్థానికాధికారి మంచికాళు కొడుకైన కొణ్డపకు చెరి సమాన ముగ పాలికి సేద్యముచేయునట్లు ఏర్పాటుచేసిన భూమి యిది అని మొదటి వాక్యానికి అర్థ ము.అట్లని తాంబుల స్వీకారము చేయబడెను.ఈ భూమిని కూన్తుకున్తుల అంటే బిడ బిడ్డతరమున పరువదివడ్డి అంటే వ్యవసాయ పర్వము నాడు చెల్లించుపన్ను చెల్లించిన సేద్యము(ఏటేటా)ఆరంభచేయువారు.అంటే ప్రారంభ ముచేయగలరు.భూమిలో సేద్యమునకు దిగునపుడు ముందుగ భూస్వామికి కొంత చెల్లించవలెను.పంట వచ్చిన తరువాత మఱికొంత చెల్లించవలెను.


పరువది=వ్యవసాయ పర్వదినమగు యేరువాక పూర్ణిమవంటి దినము.నీరారం బంబు,కాడారంబంబు,(వరియారంబంబు,వెల్లారంబంబు అని కొరవి శాసనంలో పన్నులు విధించబడెను.అట్టియారంభము ఇది)