పుట:TeluguSasanalu.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

9. కొండపఱ్తి శాసనము.


వరంగల్లు సమీపములో కొండపఱ్తి యను గ్రామమువద్ద చెఱువులో నొకకొండరాతిపైన ఈ శాసనము కలదు.ఇది ఇటీవలనే కనుగొబబడెను.అక్షరములు సుమారు తొమ్మిద వ శతాబ్దమునకు చెందునని భావింపబడుచున్నవి.అర్థమగుటలో నిదియు కొంత చిక్కు కలిగించుచున్నది.ఇది యొక పొలమును కట్టుబడి కిచ్చు సందర్ంహమును తెలుపును.

  1. స్వస్తి[|]పొలమెయరట్టోడి మంచికాళు
  2. కొణ్డపకు సమభగంబు తంబుల స్రవంబు చేసిన
  3. భూమి[|*]దీని గూన్తుకున్తుల పరుదివడ్డి యారంభఛేయువారు[|*]
  4. యిట్లు దక్కనిగల్పమణ్డి తంబులంబు దిన్నవారవన్దామి గొరవలు[దా]నమెయు
  5. కుమరమయ్యయు గణపతి యోజు యిట్లు సాక్షిగాను తంబు[ల]స్రవంబు చేసిన స్రవణభూమి[|*]
  6. యీ నెల యరి నాలుగు ద్రమ్ములు ఆయంబు పుట్టెణ్డుగొలుగు ధనంజెయ ఫలధారు
  7. కొనువారు ఆకిడి ప[ం]గులేదు[|*]యుద్దఱు బొత్తున నార[ం]భ చేయువారు అమ్మ೯ కొణ్డమణ్డీ యారంభ
  8. చేయువాణ్డు స్రావకుల భీమియక్ఱొం పాలదివాకరయస్రన్నుగొల మేడియము సాక్షి{|*]
  9. నాగ కమరియ క్రొచ్చె{||*]మంగళ మహాశ్రీ[||*]

'క్ఱొంపాల'పదములో(8వపంక్తి)'ఱ'అక్షరము వాడబడెను.సున్నకు బదులింక బిందువులేగలవు.తంబుల స్రవంబుచేసిన భూమి-ఉదకధారా పూర్వకము చేసి దాన ము లొసగుట మనకు తెలుసు.ఇది తాంబూలము పుచ్చుకొని యిచ్చినభూమి. ఇది దానముకాదు.ఒక కట్టడి.అంటే భూమి సేద్యము