పుట:TeluguSasanalu.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

42

తెలుగు శాసనాలు


నపుడు వారి దహనమప్పుడుగాని లేక ఖనమప్పుడుగాని మరియొక సజీవునికూడ ఆమృతదేహముతో కలిపి తుది సంస్కారము చేసెడివారు.సహగమనములో భార్యయే అట్లు భర్త యొక్క మృతదేహము ననుసరించిపోయెడిది.ఇచట అట్లుకాక రాజకళే బరముతో వేఱొకనిని బలవంతముగ జంపువారు.'రాచపీనుగ తోడు లేనిదేపోదు' అనెడి సామెతకు ఇదియే మూలము.యుద్ధములందు చనిపోయిన రాజులకు మాత్ర మే యిట్లు చేసెడివారో లేక సామాన్యముగ రాజులెట్లు చనిపోయినను చేసెడివారో తెలియదు.ఇప్పటికి మనకు తెలిసిన ఆధారములనుబట్టి యుద్ధమృతులగు రాజులకే యూ కీఱుగుణ్ట సంస్కారము జరిగెడిదని తెలియుచున్నది.ఇట్టి శాసనములు మఱి కొన్నిగలవు.ప్రస్తుతమున కణ్ణనూద్లు అనువ్యక్తి సజీవుడుగనే త్రినేత్రుని మృతదేహము తో కలిపి కీఱుగుంట(అనగా రెండు విధములగు శరీరములను కలిపి గుంటలో పాతిపెట్టబడు) సంస్కారమును పొందెను.ఈ సందర్భమున మృతుడగు రాజుయొక్క వస్త్రములు ,అలంకారములు మున్నగునవి యీ సజీవవ్యక్తికి తొడిగి ఆవేషముతో నతనిని మృతదేహముపై గూర్చుండబెట్టి పూడ్చెడి వారు.అణివెట్టుట అనగా ఈ యర్థమే కావచ్చును. కిటెల్-కన్నడ నిఘంటువులో అణి=to come near:to touch,etc.to put on jewels and ornaments, toembellish అని యున్నది. మృతదేహమునకు అలంకారముండదు గనుక జీవదేహమునదిచేసి తృప్తిపడుట దీని ఇద్దేశ్యమై యుండును.


ఇట్టి త్యాగము చేసినందులకు ప్రతిఫలముగ వాని సంతతి వారికి మాన్యము లిచ్చెడి వారు.ఈ శాసనమట్టి మాన్యమును తెలుపుచున్నది.రెండవ భాగమున రాజగు గణ్డత్రిణేత్రుడు కల్చి(కాల్చి)(దహనమే జరిగేననిపించుచున్నది) పుల్కవేళ్ళు (=పునుక తాలుపు?) అనగా యుద్ధములందు మారణక్రియకు ఆధి దైవము.వీర మరణము బొందువారికి ఆవేల్పుపేర సాసనమిచ్చుట,ఆవేల్పుపేర పూజ సేయుట, మున్నగునవి కలవు.పుల్కవేల్పుని సేవించుట ఆచారము తరువాత మైలార, బేతాళ దేవులను సేవించుట యైనది.ఇది వీరుల మారణ హోమమునకు సంబంధించిన తంతు.సొరమేడి యుద్ధమున చనిపోయిన వీరులనేకులకు ఇట్టి సంస్కారములు చేయబడి యుండును.రెండు,మూడు శాసనములట్టివి కని పించుచున్నవి.ప్రస్తుతము ఎణ్బయి(మర్తురులు)కీఱుగుంట సొచ్చినవాని వారికిచ్చి పురివు(=అర్థమగుట లేదు)రాచవెట్టిరి.