పుట:TeluguSasanalu.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గణ్డత్రిణేత్ర వైదుంబ మహారాజు వన్ధాడి శాసనము

41

మూలము

  1. స్వస్త అనేక సమర సంగట్టణో
  2. పల్ధ(ఫల)జయలక్షుమీ సమలింగిత
  3. వక్షస్త[ళ]కలిగె త్రిణేత్ర శ్రీసింగ
  4. [మర]సేనాపతి వీరమహార(రా)జ స్వస్తి శ్రీ మహా
  5. ర(రా}జు రేనాణ్టి పోదన్డ(డ=θ)ర స్వగ్గ೯ంబెక్కిన కణ్ణ-
  6. నూఱు అణివెట్టి కీఱుగుణ్టసొ[చ్చి]
  7. రి[I*]గణ్డ త్రిణేత్రున్డు(డ=θ)కల్చి పుల్కవే
  8. ళ్పు సాసనంబు ఇచ్చె.ఎణ్భయి
  9. వెట్టి పురి[పురాచ]వెట్టిరి[|]కణ్ణ నూడ్ల(డ=θ)
  10. గొలంబున వరికి వయ్ధుంబ వసంబున వారు[దే]నికి
  11. వక్రంబు వచ్చినవాన్డు(డ=θ)వారణాసి పాఱను కవిలళాను ఱచ్చిన
  12. వన్డు(డ=θ)[|]గట్టులి[ఖి*]తమ్[||]*


'అనేక సమర సంఘట్టనో పలబ్ధ జయలక్ష్మీ సమాలింగిత వక్షస్థల'అనునది వైదుంబ రాజుల ప్రశస్తి. ఇచట చనిపోయినది,వైదుంబాన్వయమున రాజపుత్రుడు ను,యువ రాజును కావచ్చును.కనుక ఆ ప్రశస్తి యితనికి చెప్ప బడెను.అతని పేరు కలిగె త్రిణేత్రుడు.సంగ[మర],సేనాపతి వీరమహారాజు అని అతని బిరుద నామములు. అతడు రేనాడులోని పొదన్డు(డ=θ)ర (స్థలముపేరు)వద్ద మరణించెను.రేనాటి రాజుల రాజధాని పొదిలి యనునది యొకటి కలదు.అచట ఈతడు యుద్ధమున మరణించి యుండును లేక ఈ శాసనమున్న 'వన్ధడి' పొదన్డి(డ్=θ)దాని వికృతి యయినను కావచ్చును.స్థలనామమని చెప్పుటయే యుక్తమని తోచుచున్నది.'పొదన్డుర(θ)'అనుపదములో 'ఊర'అని తుదివర్ణము పలుక వీలగుచున్నది.'రేనాంటి'అని ముందున్నది. కనుక రేనాంటిలోని'పొదండి'యునుచోట అనిచెప్పిన బాగుండునని తోచుచున్నది. అచట యుద్ధమున కలిగెత్రిణేత్ర సేనాపతి మరణించగా,అతనిని ఖననము లేక దహనము చేయునప్పుడు అతనితోపాటు కీఱుగుణ్ట సొచ్చినవాడు కణ్ణవూద్లు అనువాడు.రాజులుగాని,యువరాజులుగాని యితర ముఖ్యులుగాని చనిపోయి