పుట:TeluguSasanalu.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8. గణ్డత్రినేత్ర వైదుంబ మహారాజు వన్డాడి శాసనము

(రాయచోటి తాలూక.)


రేనాటి చోళుల తరువాత ఎనిమిదవ శతాబ్ది తుదియందు కడప మండలము బాణ రాజులకును,వైదుంబ రాజులకును వశమయ్యెను.వైదుంబులు మొదట చిత్తూరు మండలములో నుండెడివారు. వారికి వైదుమ్బవ్రోలు అను నగరము రాజధాని. తర్వాత రేనాటి చోళులను నిర్జించి చిర్పులి నాక్రమించుకొనిరి.కొంతకాలమునకు పొత్తపి (రాజం పేట తాలూక),కలుగడ(వాయల్పాడు తాలూక)నగరములు కూడ వీరి కి రాజధానులయినట్లు శాసనము లందు కలదు.రేనాటి చోళులవలె వైదుంబు లు కూడ తెలుగు మాట్లాడు రాజవంశమువారు.వీరి శాసనములనేకము తెలుగు లోను కొన్ని కన్నడములోను కలవు.వాటిలో అధిక భాగము యుద్ధములను గూర్చి బేర్కొనుచు అందు మృతినొందిన వీరుల స్మారకములుగ వేయించబడిన వి.వీటినిబట్టి యుద్ధ ప్రియులగు రాజులని తెలియుచున్నది.9,10 శతాబ్దు లలోని వీరిశాసనములు ప్రాచీన శాఖకు చెందినవి.11,12 శతాబ్దులవి ఆర్వాచీన శాఖకు చెందిన రాజులని చరిత్ర కారులు చెప్పుదురు.ఈ రాజుల చరిత్ర నిర్మాణమునకు తగిన శాసన సామగ్రి యింకా కభించక పోవుటచే వీరి ఉభయ శాఖల చరిత్ర సరిగా తెలియదు.

ప్రాచీన వైదుంబులు బాణరాజులతో కలసినోళంబ,గంగ,చోళ రాజులపై యుద్ధము లనేకము చేసిరి. అట్టి యుద్ధములలో సుమారు క్రీ.830 ప్రాంతములో జరిగిన సొరమే డి యుద్ధమతి ముఖ్యమైనది.ఈ సమరములలో ననేక వీరులు మరణించి నట్లు శాసనములనుబట్టి తెలియుచున్నది.పెనుకొండ తాలూకాలోని చోళెమరి యనునది 'సొరమెడి'యగునని నిర్ణయించిరి.ముదిమడువను వేఱొక గ్రామము వద్ద కూడ యుద్ధము జరిగెను.వైదుంబ మహారాజు గణ్డత్రిణేత్రుడిందు పాల్గొనెను. ఈ క్రింది శాసనము అతని సేనాపతియు వైదుంబాన్వయమునకు చెందినట్టియు కలిగ త్రిణేత్రుడను రాజు రేనాంటి పోదన్డు(డ=θ)రవద్ద యుద్ధములో మృతినొందినట్లే క్రిందిశాసనమున కలదు.