పుట:TeluguSasanalu.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

36

తెలుగు శాసనాలు


'అరి' పదమును 'శర్మారికి'ఇత్యాదులయందువలె 'అర్య' శబ్దభవముగ గ్రహించి 'గారు' అని అర్థము చెప్పుకొని 'అయితాణ్ణగారు'అనే బాల లేక చిన్నవేఁగు అని సర్దుబాటు చేయవలెను.' అయితాణ్ణారి' అనివ్రాయుటకు 'అయితాణ్ణ అరి'అని 'ణ 'కు ఉండవలసిన దీర్ఘమును 'త'కువ్రాసి 'అరి'అనివిడిగా వ్రాసెనేమో,ఎదో విధంగా సరిపెట్టవలెను.లేకపోయిన కొడుకు పేరు విలక్షణంగా ఆనాటి పేర్లకు దూరంగా ఉంటుంది. తండ్రి పేరు'కార్ల(ర=θ)అనిచెప్పుటలో కూడ కొంత తప్పు ఉన్నదని తోచును. 'కార్ల(ర=θ)అనేది మనిషి పేరగునా కాదా?'వ్ర్యేంగు' వలె అదికూడ నొక చిన్న అధికారిని తెలుపు పేరగునా?అట్టి అధికారుల అనగా 'కార్ల (ర=θ) పై అధికారి 'వ్ర్యేంగు'కాదగునా? అపుడు 'కొడుకు' అనుపదానికి తండ్రి పేరు దొరక దు.పోనీ అధికారి కొడుకేననవచ్చు లేదా కొడుకు పేరులో 'అయితాణ్ణ'అనేది తండ్రి పేరే కావచ్చు కూడ.'అరిపాల' అనేదే కొడుకు పేరు అగును.ఈ విధంగా కూడ చెప్పుట కవకాశము కలదు.


మనకు రేవణకాలు,వుద్దణకాలు వంటి పేర్లుగల అధికారులు కొందరు శాసనాల్లో అచ్చటచ్చట కనిపించెదరు.అట్టికాలులనే ఉద్యోగులమీద దూతయైన వానిని 'కాద్లి వ్ర్యేంగు' అనిచెప్పవచ్చునుకదా!ఇట్లనుకొనుటలో కూడ కొంత ఆధార మీ శాసనం లోనే కలదు.నాలుగవ వాక్యంలో 'సాక్షులుగ జెప్పబడిన వారందరు కాలురే.చేమ+కాలు= చేంగాలు అనురూపమగునని తోచును. ఎన్ముళకాలు (=ఎనుములమీద అధికారి),ఏడ్లకాలు(=ఏడలనగా గొఱ్ఱెలు కనుక గొఱ్ఱెలమీద అధికారి). మేషికాణ్ణ్డు (=మేకలమీద అధికారులు)తాఱడ్లకాలు(దీని కర్థము తెలియదు)అంటే చేల మీద ,బఱ్ఱెలమీద,గొఱ్ఱెల మీద,మేకల మీద, తాఱడ్లమీద పన్నులు వసూలు చేయు అధికారులని అర్థము.ఈ కాలుర మీద పైయధికారి అనగా వీరు వసూలు చేసిన పన్నులను రాజుగారికిచ్చు వేఁగు 'కాండ్ల (డ=θ)వ్ర్యేంగు' అనబడును. 'అరిపాల'అనే పదం పన్నులను వసూలు చేయునను నర్థమునే సూచించు నేమో .కొండవర్తి శాసనంలో 'ఫలధారు'అనే సుంకరి యొకడు కనిపించును. 'అరిపాల'