పుట:TeluguSasanalu.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

32

తెలుగు శాసనాలు

లెన్నియైనను చేయుటకు వీలుగ నున్నది.సాక్షులనిర్దేశము అంటే అక్కడ ఎదురుగనున్న వారిని మనసులో పెట్టుకొని వారిపేర్లు కూడ వ్రాయకయే వీరు సాక్షులని చెప్పబడెను.కంచర్లు ఎందరో తెలియదు.మొత్తము నలుగురని మాత్రము చెప్పబడెను.ఇచ్చిన పన్నస యొక్క పరిమితి యెల్లలు గాని చెప్పబడలేదు.

దీనిని బట్టి ఆనాటి మంచిభాషలో వ్రాయబడిన శాసనాలైనను మనకీనాడు సులభముగ నర్థము కావని చెప్పవలెను.దానికి ఆనాటి భాష సరిగా రూపొందక పోవుటయే కారణము.భాషను తయా రు చేసుకొనే కాలమది.ఇప్పుడు మనకట్టి కాలమొకటి తెలుగుభాషకుండెనా యనిపించును. ఉన్నద నుటకు ఈ అసంబద్ధ వాక్యములే ప్రమాణము.మాట్లాడునప్పుడువారు ద్రావిడ,కన్నడ, ప్రాకృతము లతో కూడిన తెలుగుభాషను మాట్లాడువారు.కన్నడులు తాము కన్నడములోనే వ్రాయటం మొదలిడి నప్పటినుండి వీరికికూడ భాషాభిమానము పుట్టి వ్రాయడం ప్రారంభించిరి.ఆనాటి శ్రమయే నేడు మనము తెలుగువారము అని చెప్పుకొనుటకు మూలము. తెలుగు వారికి ఆఱు-ఏడు శతాబ్దము లలోని వారే మూలపురుషులు.నన్నయాదులకంటె మున్ముందు వారికే మనజాతి అర్పించవలసిన అగ్రతాంబులము.గాసట-బీసట భాషనైనా మనకు నేర్పఱచి యిచ్చిరికదా! నేటి విశాలాంధ్ర నిర్మాణ మునకు ఆనాటి వారి తెలుగు భాషా నిర్మాణమే మూలము.