పుట:TeluguSasanalu.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అరకట వేముల శాసనము

31

రామాపురం లోని చాళుక్య విక్రమాదిత్యుని శాసనము ఇదే కాలమునకు చెందిన దొకటి కలదు.అయినను 'శ్రీ'ని స్వస్తిశ్రీలో దానినిగ చెపితే వల్లభ మహారాజగును.శ్రీ వల్లభుడుగాని వల్లభుడుగాని ప్రసిద్ధ రాజెవడు ఆనాడున్నట్లు తెలియదు.

2.పెబా೯ణవంశ భుజంగది భూపాదిత్యుల కదాన్-ఇది దానము చేసిన దాతను తెలుపును.భూపాదిత్యుడనే సామంతుడనుకొనవలెను.ఆయన మహాబాణ వంశమునకు చెందినవాడు.'కదాన్' అనే పదనికి అర్థము తెలియదు.పెర్ అనగ కన్నదములో గొప్ప అని అర్థము.

3.'చరువశర్మ పుత్ర విన్నశర్మళాకు'అని ప్రతిగ్రహీత పేరు,తండ్రి పేరుతో కలిపి సమాసము చెయబదినది.నిడగడంబున-అనేది స్థలనామము కావచ్చు ను.అచ్చట పన్నశ అంటే భూమి దానము ఇచ్చిరి.

4.సాక్షులు నల్వురు.ఉన్నపదాలు నాలుగు.(1)వేంగుళూదు,(2)పెన్డు(డ్=θ)కాలు(3)నారకోళు(4)కంచద్లు.ఈ నాలుగు మను ష్యుల పేర్లగునా కాదా అని సందేహము.వేంగుళూద్లు అనునది ఊరి పేరగుచో పెన్డ్రుకాలు ఆ యూరివాడగు.ఇదియే ఉచితమని తోచును.కాని 'వేంగుళూద్ల అని షష్ఠ్యంతముగా లేదు.పైన 'వంగనూద్ల'షష్ఠ్యంతము కలదు.'నారకోళు 'అనునది స్థలనామమో మనిషిపేరో తెలియదు.కాబట్టి నయిష్టం మీద ఆధార పడియున్నది.'నమ్మిపోళు 'అని మనిషిపేరొకటి బాణ వంశపు ధవళెయ రాజు యొక్క బలపనూరు శాసనములోకలదు.అట్లే యిది యు మనిషి పేరగునేమో.కంచద్లు(కంచరివాండ్రు)అనియెందరో తెలియదు. ఈ నాల్గిటి లోను ఒక్కటికూడ మనిషి పేరుగా కనిపించదు. వేంగుళూద్లు, వేల్పుచెర్ల, శాసన మందున్న వ్ర్యేంగులవంటి వారి సంఘమునకు చెందిన నివాసమని తోచును.వారికి సంబంధించిన 'పెద్దకాలు'అనగ ఆసామి లేక ఉద్యోగి యని అర్థమగును. 'కణ్ణనూద్లు' అని మనిషి పేరుగా వైదుంబ గండ త్రిణేత్రుని శాసనము లో నున్నది.అట్లే వేంగుళూద్లు మనిషిపేరగునేమో చెప్పజాలము.ఇట్టి యూహ